విమానం మీద ప్రయాణికుడి పెత్త‌నం!  

విమానాన్ని సిబ్బంది కాకుండా.. ఓ ప్రయాణికుడు నిర్దేశిస్తే..? విమానం టేకాఫ్‌ నుంచి.. దిగే వరకు ఆయన ఆలోచనతోనే విమానం నడిస్తే..! విమాన సిబ్బందికి తెలియకుండానే ఇదంతా జరిగితే..! అమ్మో ఇంకేమైనా ఉందా..? అగ్రరాజ్యంతోపాటు వివిధ దేశాల విమాన వ్యవస్థలో లోపాలను ఓ అమెరికన్‌ సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు ఎత్తి చూపాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 15-20 సార్లు.. విమానాల్ని తనే కంట్రోల్‌ చేశానని చెప్పి విమానయాన సంస్థలను ఆత్మరక్షణలో పడేశాడు క్రిస్‌ రాబర్ట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు. […]

Advertisement
Update:2015-05-19 01:36 IST
విమానాన్ని సిబ్బంది కాకుండా.. ఓ ప్రయాణికుడు నిర్దేశిస్తే..? విమానం టేకాఫ్‌ నుంచి.. దిగే వరకు ఆయన ఆలోచనతోనే విమానం నడిస్తే..! విమాన సిబ్బందికి తెలియకుండానే ఇదంతా జరిగితే..! అమ్మో ఇంకేమైనా ఉందా..? అగ్రరాజ్యంతోపాటు వివిధ దేశాల విమాన వ్యవస్థలో లోపాలను ఓ అమెరికన్‌ సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు ఎత్తి చూపాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 15-20 సార్లు.. విమానాల్ని తనే కంట్రోల్‌ చేశానని చెప్పి విమానయాన సంస్థలను ఆత్మరక్షణలో పడేశాడు క్రిస్‌ రాబర్ట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు. విమానం ఎక్కగానే అందులోని ఇన్‌ ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎఫ్‌ఈ) అదుపులోకి తీసుకునేవాడు. సీటు కిందుండే.. ఐఎఫ్‌ఈ వ్యవస్థను కేబుల్‌తో తన లాప్‌టాప్‌కు అనుసంధానం చేసి డీఫాల్ట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయ్యేవాడు. పైలట్‌, కో-పైలట్‌ల‌కు ఏమాత్రం అనుమానం రాకుండా కావాల్సినపుడు విమానాన్ని ఏటవాలుగా తిప్పేవాడు. ఈ మధ్య డెన్వెర్‌ నుంచి చికాగోకు వస్తున్నప్పుడు ఐఎఫ్ఈని ఆధీనంలోకి ఎలా తీసుకోవాలనే విషయాన్ని రాబర్ట్‌ ట్వీట్‌ చేశారు. అప్పుడు.. ఈ విషయం తెలుసుకున్న ఎఫ్‌బీఐ విమానం దిగగానే రాబర్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాబర్ట్‌ చెప్పిన విషయాలు, ఎత్తిచూపిన లోపాలను చూసి ముక్కున వేలేసుకున్నారు. తన సీట్లో కూర్చునే కాక్‌పిట్‌ నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ను గమనించేవాడినని రాబర్ట్‌ విచారణలో చెప్పాడు. ఇది విన్న విమాన‌యాన సిబ్బంది నోరెళ్ళ‌బెట్టారు!
Tags:    
Advertisement

Similar News