సమ్మె ఉధృతం చేసిన 108 ఉద్యోగులు
వేతనాలు పెంచాలని, తొలగించిన సిబ్బందిని తిరిగి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత, కనీస వేతనం, 8 గంటల పనివిధానం తదితర 15 డిమాండ్లతో మూడు రోజుల నుంచి చేస్తున్న ‘108’ ఉద్యోగుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఉద్యోగుల సమ్మెకు వివిధ ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే సీఐటీయూ, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు […]
Advertisement
వేతనాలు పెంచాలని, తొలగించిన సిబ్బందిని తిరిగి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత, కనీస వేతనం, 8 గంటల పనివిధానం తదితర 15 డిమాండ్లతో మూడు రోజుల నుంచి చేస్తున్న ‘108’ ఉద్యోగుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఉద్యోగుల సమ్మెకు వివిధ ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే సీఐటీయూ, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు మద్దతు తెలిపాయి. త్వరలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.. అప్పటికీ జీవీకే దిగిరాకుంటే రిలే నిరాహార దీక్షలు చేపడతామని 108 ఉద్యోగులు చెప్పారు. తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో ఆదివారం ఒక్క అంబులెన్స్ కూడా రోడ్డెక్కలేదని ఉద్యోగులు తెలిపారు.
మరోవైపు జీవీకే-ఈఎంఆర్‌ఐ యాజమాన్యం ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో నోటీసులు జారీచేసింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెదిరింపులకు లొంగబోమని ఉద్యోగ సంఘం నేతలు స్పష్టం చేశారు. డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
Advertisement