పసివాడి ప్రాణం తీసిన కక్షలు
ఆదిలాబాద్ : దుండగులు రెచ్చిపోతున్నారు..చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా దారుణంగా హత్యలకు ఒడిగొడుతున్నారు.. ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలుడిని దుర్మార్గులు అతి దారుణంగా హత్య చేశారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన వినయ్ శనివారం ఉదయం శవమై తేలాడు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లిఖార్జుననగర్లో వినయ్ (6) తల్లి నాగలక్ష్మితో ఉంటూ యూకేజీ చదువుతున్నాడు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వినయ్ కనిపించకపోవడంతో నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. […]
Advertisement
ఆదిలాబాద్ : దుండగులు రెచ్చిపోతున్నారు..చిన్నా..పెద్ దా అనే తేడా లేకుండా దారుణంగా హత్యలకు ఒడిగొడుతున్నారు.. ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలుడిని దుర్మార్గులు అతి దారుణంగా హత్య చేశారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన వినయ్ శనివారం ఉదయం శవమై తేలాడు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లిఖార్జుననగర్లో వినయ్ (6) తల్లి నాగలక్ష్మితో ఉంటూ యూకేజీ చదువుతున్నాడు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వినయ్ కనిపించకపోవడంతో నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం ఉదయం ఇంటి ఎదుట గోనె సంచిలో వినయ్ మృతదేహం కనిపించింది. దీనితో తల్లి నాగలక్ష్మి భోరున విలపించింది. నాలుగు సంవత్సరాల క్రితం వినయ్ తండ్రిని కూడా దుండగులు హత్య చేశారు. దీనికి సబంధించిన కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ కొంతమంది నిందితులు నాగలక్ష్మిని అడిగారు. ఆమె అందుకు నిరాకరించడంతో ఈ బాలుడిని హత్య చేశారని భావిస్తున్నారు. ాలుడు హత్యకు గురికావడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. బాలుడి హత్య వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా… లేక ఆస్తి తగాదాలా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement