వాహనదారులకు యమధర్మరాజు హెచ్చరిక!
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లనే చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులకు ఎన్ని రకాలుగా చెప్పినా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. అలాంటి వారి కోసమే జార్ఖండ్ రాజధాని రాంచిలో అక్కడి ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ కానిస్టేబుల్ చేత యముడి వేషాధారణ వేయించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చావు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. వాటివల్ల కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరికీ వివరిస్తున్నారు. […]
Advertisement
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లనే చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులకు ఎన్ని రకాలుగా చెప్పినా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. అలాంటి వారి కోసమే జార్ఖండ్ రాజధాని రాంచిలో అక్కడి ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ కానిస్టేబుల్ చేత యముడి వేషాధారణ వేయించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చావు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. వాటివల్ల కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరికీ వివరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు వేశారు. అయితే గతంలోనూ రాంచీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. వారిలో మార్పు రాకపోవడంతో యమధర్మరాజు చెబితేనైనా వింటారనే ఆలోచనతో ఇలా చేస్తున్నామని చెప్పారు.
Advertisement