భీమవరంలో మెరైన్‌ వర్శిటీ: చంద్రబాబు

మూడు నాలుగు నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పట్టిసీమ పనులను పర్యవేక్షించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 965 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ప్రాజెక్టులన్నీ పూర్తయి రవాణా వ్యవస్థ బలపడితే ప్రజల తలసరి ఆదాయం ఎంతో పెరుగుతుందని ఆయన అన్నారు. భూములు అందుబాటులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు […]

Advertisement
Update:2015-05-15 08:46 IST

మూడు నాలుగు నెలల్లో పట్టిసీమ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పట్టిసీమ పనులను పర్యవేక్షించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 965 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ప్రాజెక్టులన్నీ పూర్తయి రవాణా వ్యవస్థ బలపడితే ప్రజల తలసరి ఆదాయం ఎంతో పెరుగుతుందని ఆయన అన్నారు. భూములు అందుబాటులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలను పర్యాటకంగా తీర్చిదిద్దమని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ జిల్లాలోని భీమవరంలో త్వరలో మెరైన్‌ యూనివర్శిటీ ప్రారంభమవుతుందని, ఎక్కడ అనువైన పరిస్థితులున్నాయో అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతామని ఆయన తెలిపారు. అనంతరం పోలవరం కుడి కాలువ పనులను పరిశీలించారు.

Tags:    
Advertisement

Similar News