బంగారానికి మళ్లీ గిరాకీ!

బంగారానికి గిరాకీ మళ్లీ పెరుగుతుంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ 15 శాతం మేర పెరిగి 167.1 టన్నుల నుంచి 191.7 టన్నులకు ఎగిసింది. ఇదేకాలంలో విలువ పరంగా బంగారానికి గిరాకీ 9 శాతం మేర వృద్ధి చెంది 42,898.6 కోట్ల రూపాయల నుంచి 46,730.6 కోట్ల రూపాయలకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) స్ప‌ష్టం చేసింది. ఇదే త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 123.5 టన్నుల నుంచి 150.8 టన్నులకు ఎగ బాకింది. […]

Advertisement
Update:2015-05-14 19:25 IST
బంగారానికి గిరాకీ మళ్లీ పెరుగుతుంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ 15 శాతం మేర పెరిగి 167.1 టన్నుల నుంచి 191.7 టన్నులకు ఎగిసింది. ఇదేకాలంలో విలువ పరంగా బంగారానికి గిరాకీ 9 శాతం మేర వృద్ధి చెంది 42,898.6 కోట్ల రూపాయల నుంచి 46,730.6 కోట్ల రూపాయలకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) స్ప‌ష్టం చేసింది. ఇదే త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ 123.5 టన్నుల నుంచి 150.8 టన్నులకు ఎగ బాకింది. విలువ పరంగా ఆభరణాల డిమాండ్‌ 16 శాతం వృద్ధితో 31,706.4 కోట్ల రూపాయల నుంచి 36,761.4 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే మొదటి త్రైమాసికంలో పెట్టుబడుల డిమాండ్‌ మాత్రం క్షీణించింది. బంగారంలో పెట్టుబడులు జనవరి-మార్చి త్రైమాసికంలో 6 శాతం మేర క్షీణించి 43.6 టన్నుల నుంచి 40.9 టన్నులకు చేరింది. ఇదే కాలంలో కేవలం 18 టన్నుల బంగారం మాత్రమే రిసైక్లింగ్‌ జరిగింది. బంగారం ధర త క్కువగా ఉండటం, ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధాన నిర్ణయాల వల్లనే గిరాకీ పెరగడానికి అవకాశం ఏర్పడిందని డబ్ల్యుజిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరమ్‌ పిఆర్‌ తెలిపారు.
Tags:    
Advertisement

Similar News