రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఏపీ: యోగేంద్ర యాదవ్
రైతుల నుంచి వేలాది ఎకరాలను సేకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిందని, దేశంలోనే ఇది అతి పెద్ద భూకుంభకోణమని స్వరాజ్ సంవాద్ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ అభివర్ణించారు. బహుళ పంటలు పండే వేల ఎకరాల పంట భూములను రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి లాక్కోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య చట్టాలను ఉల్లంఘించి రైతుల హక్కులను కాలరాసేలా ఉందని విమర్శించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని […]
Advertisement
రైతుల నుంచి వేలాది ఎకరాలను సేకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిందని, దేశంలోనే ఇది అతి పెద్ద భూకుంభకోణమని స్వరాజ్ సంవాద్ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ అభివర్ణించారు. బహుళ పంటలు పండే వేల ఎకరాల పంట భూములను రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ పేరుతో రైతుల నుంచి లాక్కోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య చట్టాలను ఉల్లంఘించి రైతుల హక్కులను కాలరాసేలా ఉందని విమర్శించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, మల్కాపురం, తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం రాయపూడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంజాబ్ రాజధాని చండీగఢ్ కోసం ప్రభుత్వం కేవలం 9 వేల ఎకరాలు సేకరించగా, ఇక్కడి ప్రభుత్వం మాత్రం రాజధాని పేరుతో వేల ఎకరాలు స్వాధీనం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు తమ పూర్తి మద్దతు అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బహుళ పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మిస్తే ఆహార సంక్షోభం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికీ రాజధాని పరిధిలో సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రైతుల ఆస్తిగా ఉన్న భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కోవటం తగదన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల హక్కులను ప్రభుత్వాలు పరిరక్షించాలని యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.
Advertisement