16 నుంచి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహణ
ఈనెల 16 నుంచి 20 వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్‌తోపాటు నగర సమస్యలపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ మంత్రులు నాయిని, తలసాని, టీడీపీ ఎంపీ మల్లారెడ్డితో పాటు గ్రేటర్ పరిధిలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ. 200 కోట్ల నిధులు మంజూరు […]
Advertisement
ఈనెల 16 నుంచి 20 వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్‌తోపాటు నగర సమస్యలపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ మంత్రులు నాయిని, తలసాని, టీడీపీ ఎంపీ మల్లారెడ్డితో పాటు గ్రేటర్ పరిధిలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు, వచ్చే నాలుగేళ్ళలో కూడా ప్రతీ యేడాదీ రూ. 200 కోట్ల చొప్పున స్వచ్ఛ హైదరాబాద్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఆయన చెప్పారు. హైదరాబాద్‌ను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేశామని, మళ్ళీ దీన్ని 400 విభాగాలుగా విభజించామని ఆయన తెలిపారు. ప్రతీ విభాగానికి ఒక ఇన్‌ఛార్జిని నియమిస్తామని, ఇందులో గవర్నర్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు అందర్నీ భాగస్వాములుగా చేస్తామని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు సుందర నగరంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని కేసీఆర్ తెలిపారు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
Advertisement