వావి వరసలు మర్చి... బాలికపై అత్యాచారం
కామంతో కళ్లు మూసుకుపోయి వావి వరసలు మరిచిన ఇద్దరు కామాంధులు 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి శివారులో ఉన్న ఓ మామిడితోట దీనికి సాక్ష్యంగా నిలిచింది. ఈ అత్యాచార ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. మామిడితోటకు కాపలాగా ఉన్న వాసూరి శేఖర్ అనే యువకుడు తోటలో వంకాయలున్నాయని, వాటిని కోసుకొని వెళ్లమని బాలికను పిలిచాడు. వంకాయలు కోసుకునేందుకు వచ్చిన బాలికను శివ అనే మరో […]
Advertisement
కామంతో కళ్లు మూసుకుపోయి వావి వరసలు మరిచిన ఇద్దరు కామాంధులు 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి శివారులో ఉన్న ఓ మామిడితోట దీనికి సాక్ష్యంగా నిలిచింది. ఈ అత్యాచార ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. మామిడితోటకు కాపలాగా ఉన్న వాసూరి శేఖర్ అనే యువకుడు తోటలో వంకాయలున్నాయని, వాటిని కోసుకొని వెళ్లమని బాలికను పిలిచాడు. వంకాయలు కోసుకునేందుకు వచ్చిన బాలికను శివ అనే మరో వ్యక్తితో కలిసి శేఖర్ తోటలో ఉన్న గదిలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు దగ్గరి బంధువైన శేఖర్ వరుసకు బాబాయ్ అవుతాడని తెలిసింది. మరో యువకుడైన ప్రసాది శివ వరుసకు అన్నయ్య అవుతాడని పోలీసులు చెప్పారు. వావి వరుసలు మరిచిపోయిన వీరిద్దరూ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికను గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి చికిత్స చేయిస్తున్నారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement