పోలీసులమని నమ్మించి రూ. 82 లక్షలు దోపిడీ
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. కావలి నుంచి నెల్లూరు వెళుతున్న సమయంలో బంగారం వ్యాపారులను కొంతమంది వ్యక్తులు బురిడి కొట్టించారు. తాము పోలీసులని చెప్పి వ్యాపారులను నమ్మించారు. వారి దగ్గరున్న నగదు ఎలా వచ్చిందో చెప్పమంటూ ప్రశ్నించారు. దీంతో సరైన సమాధానం చెప్పలేదంటూ వారిని రైలు దించేసి కారు ఎక్కించి తీసుకువెళ్ళారు. చేవూరు చేరుకోగానే వారి వద్ద ఉన్న రూ. 82 లక్షల రూపాయలను తీసేసుకుని కారు దించేసి వెళ్ళిపోయారు. వారికి అసలు విషయం అర్ధమయిన […]
Advertisement
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. కావలి నుంచి నెల్లూరు వెళుతున్న సమయంలో బంగారం వ్యాపారులను కొంతమంది వ్యక్తులు బురిడి కొట్టించారు. తాము పోలీసులని చెప్పి వ్యాపారులను నమ్మించారు. వారి దగ్గరున్న నగదు ఎలా వచ్చిందో చెప్పమంటూ ప్రశ్నించారు. దీంతో సరైన సమాధానం చెప్పలేదంటూ వారిని రైలు దించేసి కారు ఎక్కించి తీసుకువెళ్ళారు. చేవూరు చేరుకోగానే వారి వద్ద ఉన్న రూ. 82 లక్షల రూపాయలను తీసేసుకుని కారు దించేసి వెళ్ళిపోయారు. వారికి అసలు విషయం అర్ధమయిన తర్వాత కావలి చేరుకని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన మోసాన్ని గ్రహించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Advertisement