తాలిబాన్ల దుశ్చర్యకు మరో 14 మంది బలి
నిన్న కరాచీ… నేడు కాబుల్… చనిపోయింది అమాయకులే… చంపింది ఉగ్రవాదులే… బుధవారం కరాచీలో నడివీధిలో బస్సుపై కాల్పులు జరిపి 47 మంది ప్రాణాలు తీసిన తాలిబాన్లు గురువారం కాబుల్‌లో విదేశీయులు విడిది చేస్తున్న ఓ సత్రంపై దాడి చేసి 14 మందిని పొట్టన పెట్టుకున్నారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. బుధవారం కరాచీలోను, గురువారం కాబూల్‌లోను హత్యలు చేసింది తామేనని తాలిబాన్లు ప్రకటించారు. ఇది తెలిసిన వెంటనే చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడి […]
Advertisement
నిన్న కరాచీ… నేడు కాబుల్… చనిపోయింది అమాయకులే… చంపింది ఉగ్రవాదులే… బుధవారం కరాచీలో నడివీధిలో బస్సుపై కాల్పులు జరిపి 47 మంది ప్రాణాలు తీసిన తాలిబాన్లు గురువారం కాబుల్‌లో విదేశీయులు విడిది చేస్తున్న ఓ సత్రంపై దాడి చేసి 14 మందిని పొట్టన పెట్టుకున్నారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. బుధవారం కరాచీలోను, గురువారం కాబూల్‌లోను హత్యలు చేసింది తామేనని తాలిబాన్లు ప్రకటించారు. ఇది తెలిసిన వెంటనే చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడి ఆఫ్గానిస్థాన్ అధ్యక్షుడు మొహమ్మద్ అప్రష్ ఘనీకి ఫోన్ చేసి కాబూల్ కాల్పులపై ఆరా తీశారు. తమ సహకారం ఏమైనా కావాలంటే తెలియజేయాల్సిందిగా కోరారు.
Advertisement