తెలంగాణలో ‘108’ సిబ్బంది సమ్మె
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముగిసిన వెంటనే.. 108 సర్వీసు సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. చర్చలు విఫలం కావటంతో.. సమ్మెలోకి వెళుతున్నట్టు 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ చర్చలకు ఆ శాఖ సంయుక్త కమిషనర్ అజయ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఇందులో జీవీకే నేషనల్ హెడ్ శ్రీనివాస్, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, కార్యదర్శి శ్రీనివా్‌సలు పాల్గొన్నారు. తొలగించిన […]
Advertisement
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముగిసిన వెంటనే.. 108 సర్వీసు సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. చర్చలు విఫలం కావటంతో.. సమ్మెలోకి వెళుతున్నట్టు 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది. కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ చర్చలకు ఆ శాఖ సంయుక్త కమిషనర్ అజయ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఇందులో జీవీకే నేషనల్ హెడ్ శ్రీనివాస్, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, కార్యదర్శి శ్రీనివా్‌సలు పాల్గొన్నారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలనే విషయంలో ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. అయితే వారు సంస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున తొలగించామని, తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని జీవికే తేల్చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సమ్మెకు పిలుపునిచ్చాయి.
Advertisement