బీజేపీ ఎమ్మెల్యేపై కేసీఆర్ చిన్నచూపు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ శాసనసభా పక్షం మండిపడింది. ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండించింది. బీజేపీ ఎమ్మెల్యేలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బీజేఎల్పీ నేత డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలంగాణ సచివాలయానికి వెళ్ళారు. ముందుగా చెప్పినా సీఎంవోలో ముఖ్యమంత్రి లేకపోవడంతో సీఎంవో ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులను విస్మరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనంటూ నిరసన వ్యక్తం చేశారు. పేదలకు […]

Advertisement
Update:2015-05-13 02:03 IST
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ శాసనసభా పక్షం మండిపడింది. ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఖండించింది. బీజేపీ ఎమ్మెల్యేలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బీజేఎల్పీ నేత డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలంగాణ సచివాలయానికి వెళ్ళారు. ముందుగా చెప్పినా సీఎంవోలో ముఖ్యమంత్రి లేకపోవడంతో సీఎంవో ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులను విస్మరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనంటూ నిరసన వ్యక్తం చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని, నగర శివార్లకు మంచినీటి సౌకర్యాన్ని విస్తరించాలని, వేసవి నీటి ఎద్దడి నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని, రూ.200 కోట్లతో నిర్వహిస్తున్న స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని నినదించారు. ఈ విష‌యాలు ప్ర‌స్తావించ‌డానికి వ‌చ్చిన వారు సుమారు గంటపాటు అక్కడే ఉండి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి సైఫాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 151 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి అనంతరం విడుదల చేశారు. కాగా ఆందోళన సందర్భంగా డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం లేదని ఆరోపించారు. అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
Tags:    
Advertisement

Similar News