ఆటుపోట్లున్నా... సెన్సెక్స్ టార్గెట్ 33000
ప్రస్తుతానికి భారత మార్కెట్ తీవ్ర ఆటుపోట్లలో ట్రేడవుతున్నా ఏడాది చివరినాటికి సెన్సెక్స్ 33000 పాయింట్లను తాకడం ఖాయమని అమెరికన్ బ్రోకరేజి సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ కరాఖండిగా చెబుతోంది. అయితే మధ్యకాలిక దృక్పథంలో మాత్రం దలాల్ స్ర్టీట్‌లో ఆటు పోట్లు తప్పవని ఆ సంస్థ పేర్కొంది. ఆ సంస్థ తాజాగా భారత మార్కెట్‌పై తన అంచనా ప్రకటిస్తూ ప్రస్తుత ఎర్నింగ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మరో త్రైమాసికం మార్కెట్లు నెగిటివ్ జోన్‌లోనే ట్రేడవుతాయని తేల్చి చెప్పింది. […]
Advertisement
ప్రస్తుతానికి భారత మార్కెట్ తీవ్ర ఆటుపోట్లలో ట్రేడవుతున్నా ఏడాది చివరినాటికి సెన్సెక్స్ 33000 పాయింట్లను తాకడం ఖాయమని అమెరికన్ బ్రోకరేజి సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ కరాఖండిగా చెబుతోంది. అయితే మధ్యకాలిక దృక్పథంలో మాత్రం దలాల్ స్ర్టీట్‌లో ఆటు పోట్లు తప్పవని ఆ సంస్థ పేర్కొంది. ఆ సంస్థ తాజాగా భారత మార్కెట్‌పై తన అంచనా ప్రకటిస్తూ ప్రస్తుత ఎర్నింగ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మరో త్రైమాసికం మార్కెట్లు నెగిటివ్ జోన్‌లోనే ట్రేడవుతాయని తేల్చి చెప్పింది. బోఫా ఎంఎల్ ఎనలిస్ట్ జోతివర్థన్ జైపురియా విడుదల చేసిన నోట్‌లో ‘‘డిసెంబర్ నాటికి సెన్సెక్స్ టార్కెట్ 33000 అన్న మా అంచనా మారలేదు. కాని త్రైమాసిక ఆదాయాలు తక్కువగా ఉండడంతోపాటు మధ్యకాలంలో ఆదాయాలు మరింత దిగజారే అవకాశం ఉన్నందువల్ల సమీప భవిష్యత్తులో మార్కెట్ పరిమిత పరిధిలో, నిస్తేజంగానే ట్రేడయ్యే ఆస్కారం ఉంది’’ అన్నారు. కంపెనీల ఆదాయాల్లో స్థిరత్వం నెలకొనే ముందు మరో త్రైమాసికంపాటు క్షీణత తప్పక పోవచ్చునన్నారు.
Advertisement