ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్ కుట్ర: జీవ‌న్‌రెడ్డి

కరీంనగర్ : ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ బస్ ఛార్జీలు పెంచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ జేఏసీకి అప్పగిస్తే ఏడాదిలోగా లాభాల్లోకి తెస్తామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడానికి యాజమాన్యం, ప్రభుత్వమే కారణమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ 43 శాతం ఇచ్చేంతవరకు కార్మికుల పక్షాన పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Update:2015-05-10 23:20 IST

Tags:    
Advertisement

Similar News