కాంగ్రెస్ తురుపు ముక్క హ‌రీష్‌?

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏదో ర‌కంగా అధికారం కైవ‌సం చేసుకోవాల‌నుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకు ఆయుధంగా కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీష్‌రావును తురుపు ముక్క‌గా వాడుకుంటుందా? అయినా ఆశ్చ‌ర్యం లేదంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు… తెలంగాణ అధికారపక్షంలో రోజురోజుకూ పెరుగుతున్న‌ అసంతృప్త జ్వాలలు టీఆర్ఎస్ నుంచి హ‌రీష్‌ను వేరు చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. టీఆర్ఎస్‌లో అధిపత్య పోరు భారీగా సాగుతున్న నేప‌థ్యంలో పార్టీలో నెంబర్ టూ స్థానం కోసం కుటుంబంలోని వారే పోటీ ప‌డుతున్నారు. తన కొడుకు.. […]

Advertisement
Update:2015-05-11 03:56 IST
తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏదో ర‌కంగా అధికారం కైవ‌సం చేసుకోవాల‌నుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకు ఆయుధంగా కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీష్‌రావును తురుపు ముక్క‌గా వాడుకుంటుందా? అయినా ఆశ్చ‌ర్యం లేదంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు… తెలంగాణ అధికారపక్షంలో రోజురోజుకూ పెరుగుతున్న‌ అసంతృప్త జ్వాలలు టీఆర్ఎస్ నుంచి హ‌రీష్‌ను వేరు చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. టీఆర్ఎస్‌లో అధిపత్య పోరు భారీగా సాగుతున్న నేప‌థ్యంలో పార్టీలో నెంబర్ టూ స్థానం కోసం కుటుంబంలోని వారే పోటీ ప‌డుతున్నారు. తన కొడుకు.. కూతురు విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న అపప్రద మూటగట్టుకుంటున్న కేసీఆర్.. మేనల్లుడు విషయంలో పెద్దగా పట్టించుకోవటం లేదన్న ఆరోపణ ఉంది. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీష్‌కు సంబంధించి వ‌స్తున్న స‌రికొత్త‌ పుకారు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
హరీశ్ రావుపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిందని.. ఆయన్ను పార్టీలో ఆహ్వానించటం ద్వారా.. తెలంగాణ అధికారపక్షాన్ని కోలుకోలేని దెబ్బ తీయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల కలల్ని సాకారం చేసేందుకు మరింత సమర్థతతో పని చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌కు… తెలంగాణ అధికారపక్షాన్ని దెబ్బ తీసేందుకు హరీష్ స‌రైన ప్ర‌త్య‌మ్నాయ‌మ‌ని… అత‌న్ని ఎలాగైనా టీఆర్ఎస్ నుంచి వేరు చేయాల‌ని కాంగ్రెస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాక‌పోయినా హ‌రీష్ వ‌స్తే ఆయనతోపాటు మరో పది.. పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైఫునకు వ‌స్తారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. తెలంగాణ అధికారపక్షానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్‌లో హ‌రీష్‌కు ఇప్ప‌టి మాదిరిగా ఆద‌ర‌ణ ల‌భించ‌క‌పోతే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఏదోరోజు తప్ప‌క పోవ‌చ్చు.-పీఆర్‌
Tags:    
Advertisement

Similar News