48 గంటల్లో ఉప్పల్ స్టేడియం సీజ్!
తమకు బకాయి పడ్డ రూ. 12 కోట్ల ఆస్తి పన్నును చెల్లించకపోతే ఉప్పల్ స్టేడియంను సీజ్ చేస్తామని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో మ్యాచ్‌కు 75 లక్షల రూపాయలు తీసుకునే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆస్తి పన్ను ఎందుకు కట్టడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల నుంచి అంటే 2002 నుంచి ఇప్పటి వరకు పన్ను చెల్లించడం లేదని వారన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరచి వెంటనే ఆస్తి […]
Advertisement
తమకు బకాయి పడ్డ రూ. 12 కోట్ల ఆస్తి పన్నును చెల్లించకపోతే ఉప్పల్ స్టేడియంను సీజ్ చేస్తామని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో మ్యాచ్‌కు 75 లక్షల రూపాయలు తీసుకునే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆస్తి పన్ను ఎందుకు కట్టడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల నుంచి అంటే 2002 నుంచి ఇప్పటి వరకు పన్ను చెల్లించడం లేదని వారన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరచి వెంటనే ఆస్తి పన్ను చెల్లించాలని వారు కోరుతూ 48 గంటల సమయం ఇచ్చారు.
నిజానికి శనివారం ఈ స్టేడియం సీజ్ చేయడానికి సకల సరంజామాతో జిహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. వచ్చిన వెంటనే వారిపై ఒత్తిడి ప్రారంభమైంది. స్టేడియంను సీజ్ చేయొద్దని విపరీతమైన రాజకీయ ఒత్తుడులు ఎదురయ్యాయి. రెండు గంటలు ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయారు. చివరకు రాజకీయ నాయకులే తమ పంతం నెగ్గించుకున్నారు. మరో 48 గంటల సమయం ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్ప వారేమీ చేయలేకపోయారు.
రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే జీహెచ్ఎంసీ తనకు రావలసిన బకాయిలు వసూలు చేసుకోలేకపోతుందని, తమ పరపతితో మున్సిపాలిటీకి రావాల్సిన రూ. 12 కోట్ల రూపాయలు రాకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆరోపించారు. దాదాపు 13 సంవత్సరాల నుంచి బకాయిలు కట్టకుండా ఆ నిధులను వేరే దారిలోకి మళ్ళిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ ఒత్తిడికి జీహెచ్ఎంసీ తలొగ్గడం చేతకాని తనమని ఆయన అన్నారు. ఈ బకాయిలు వసూలు చేసే వరకు తాను నిద్రపోనని ప్రభాకర్ అన్నారు.
Advertisement