మంత్రి కామినేని పీఆర్వో తొలగింపు
హైదరాబాద్: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని పీఆర్వో ప్రసాద్‌ను తొలగించారు. పీఆర్వో ప్రసాద్ అవినీతిపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో వరుస కథనాలు రావడంతో స్పందించిన మంత్రి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీఆర్వోగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతి ఊబిలో కూరుకుపోయారని కథనాలు వచ్చాయి. మంత్రిత్వ శాఖ తరఫున ప్రకటనలు విడుదల చేయడంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, అసలు ఆ ప్రకటనలు రాకుండానే బిల్లులు తయారు చేసి సదరు సొమ్మును స్వాహా […]
Advertisement
హైదరాబాద్: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని పీఆర్వో ప్రసాద్‌ను తొలగించారు. పీఆర్వో ప్రసాద్ అవినీతిపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో వరుస కథనాలు రావడంతో స్పందించిన మంత్రి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీఆర్వోగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతి ఊబిలో కూరుకుపోయారని కథనాలు వచ్చాయి. మంత్రిత్వ శాఖ తరఫున ప్రకటనలు విడుదల చేయడంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, అసలు ఆ ప్రకటనలు రాకుండానే బిల్లులు తయారు చేసి సదరు సొమ్మును స్వాహా చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. అలాగే ఆరోగ్య మస్తు అనే పత్రిక పేరుతో శాఖకు ఓ పత్రికను ఏర్పాటు చేసి దాని ప్రచురణ, యాడ్‌లలోను అవినీతికి పాల్పడ్డారని విమర్శలొచ్చాయి. గతంలో ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ పత్రికకు రిపోర్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దగ్గర పీఆర్వోగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యమే కామినేని వద్దకు ఆయన్ని పీఆర్వోగా చేర్చింది. ఇపుడు పూర్తిగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి పదవి పోగొట్టుకున్నారు. ప్రసాద్ అవినీతిపై పూర్తి స్థాయి విచారణకు కూడా మంత్రి ఆదేశించారు.
Advertisement