హైద‌రాబాద్ పోలీసుల ‘ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌’

పలు ప్రభుత్వ ఆస్పత్రులను దత్తత తీసుకొని అనునిత్యం పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని హైద‌రాబాద్ పోలీసులు నిర్ణయించారు. తొలివిడతగా సెంట్రల్ జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో కింగ్‌కోఠి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్పత్రి ప్రాంగణంలో కొంతకాలంగా పేరుకుపోయిన మట్టిదిబ్బలు, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలను సుమారు రెండు గంటల పాటు శ్రమించి తొలగించారు. ఈ సందర్భంగా నగర సీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ… కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులను దత్తత తీసుకోనున్నట్లు […]

Advertisement
Update:2015-05-08 18:55 IST
పలు ప్రభుత్వ ఆస్పత్రులను దత్తత తీసుకొని అనునిత్యం పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని హైద‌రాబాద్ పోలీసులు నిర్ణయించారు. తొలివిడతగా సెంట్రల్ జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో కింగ్‌కోఠి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్పత్రి ప్రాంగణంలో కొంతకాలంగా పేరుకుపోయిన మట్టిదిబ్బలు, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలను సుమారు రెండు గంటల పాటు శ్రమించి తొలగించారు. ఈ సందర్భంగా నగర సీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ… కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులను దత్తత తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌లో హోంగార్డు నుంచి డీసీపీ వరకు అందరూ పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో సీసీ కెమెరాలను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటిండెంట్‌ రామకృష్ణ మాట్లాడుతూ… ఈ ఆస్పత్రికి మరమ్మతులు కొనసాగుతున్నాయని, పారిశుధ్యానికి ప్రతిఏటా రూ.7 లక్షలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. 35 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, అడిషనల్‌ సీపీ అంజనీకుమార్‌, ఆస్పత్రి సూపరింటిండెంట్‌ రామకృష్ణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
Tags:    
Advertisement

Similar News