ఏపీ ఆర్టీసీ ఈయూ నేతలను చర్చలకు పిలిచిన కేబినెట్ సబ్‌కమిటీ
నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు చర్చలకు రావాల్సిందిగా ఏపీ ఈయూ నేతలను ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ ఆహ్వానించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావుతోను, ఆర్టీసీ ఎండి సాంబశివరావుతోను సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఉపసంఘం స్పందించడం చూస్తే ఈ సమస్యకు తెర దించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అర్దమవుతోంది. ఈ చర్చల సందర్భంగా మంత్రి మీద, ఎండీ […]
Advertisement
నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు చర్చలకు రావాల్సిందిగా ఏపీ ఈయూ నేతలను ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ ఆహ్వానించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావుతోను, ఆర్టీసీ ఎండి సాంబశివరావుతోను సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఉపసంఘం స్పందించడం చూస్తే ఈ సమస్యకు తెర దించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అర్దమవుతోంది. ఈ చర్చల సందర్భంగా మంత్రి మీద, ఎండీ పైన… వారు వ్యవహరించిన తీరు మీద చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మెకు ముగింపు పలకడానికి ఉప సంఘం ఒక్కటే సరైన ప్రత్యమ్నాయమని సీఎం భావిస్తున్నట్టు అర్ధమవుతోంది. మరోవైపు సమ్మె అక్రమమని హైకోర్టు వ్యాఖ్యానించి తక్షణం విధులకు హాజరు కావాలని ఆదేశించడం కూడా ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది. తీర్పు కాపీ చేతికందే వరకు తాము సమ్మెకు ముగింపు పలకమని చెప్పిన కార్మిక సంఘాలు ఇపుడు ఏ మాత్రం అవకాశం దొరికినా సమ్మె విరమణకే మొగ్గు చూపడం ఖాయం. మరో ముఖ్యమైన… గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఏపీ ఉప సంఘం కేవలం ఎంప్లాయిస్ యూనియన్‌ను మాత్రమే చర్చలకు పిలవడం ఇక్కడ మరో ట్విస్ట్. అంటే తెలంగాణ సర్కారు నిర్ణయం ఏమిటన్నది ఇక్కడ ప్రతిబింబించే అవకాశం లేదు. మరి ఈ పరిస్థితుల్లో సమ్మెకు తెర పడుతుందా… ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులు ఒక్కరే సమ్మె విరమిస్తే తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
Advertisement