ఉద్యోగుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ!
ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా చెప్పుకునే విషయమిది. ఏపీ సీఎం సహాయనిధికి వచ్చిన చెక్కులు, డీడీలపై శీతకన్ను వేసి పక్కన పడేశారు. ఈ అలసత్వం ఖరీదు నాలుగు కోట్లు. ఓ వైపు విరాళాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందరి ముందూ చేయి చాచి అభ్యర్థిస్తుంటే వచ్చిన చెక్కులను, డీడీలను ఏ మాత్రం పట్టించుకోకుండా వాటికి కాలం చెల్లేలా చేశారు ఉద్యోగులు. అకస్మాత్తుగా బయటపడిన ఈ చెక్కులు, డీడీల విషయం తెలిసి రెవిన్యూ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈ […]
Advertisement
ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా చెప్పుకునే విషయమిది. ఏపీ సీఎం సహాయనిధికి వచ్చిన చెక్కులు, డీడీలపై శీతకన్ను వేసి పక్కన పడేశారు. ఈ అలసత్వం ఖరీదు నాలుగు కోట్లు. ఓ వైపు విరాళాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందరి ముందూ చేయి చాచి అభ్యర్థిస్తుంటే వచ్చిన చెక్కులను, డీడీలను ఏ మాత్రం పట్టించుకోకుండా వాటికి కాలం చెల్లేలా చేశారు ఉద్యోగులు. అకస్మాత్తుగా బయటపడిన ఈ చెక్కులు, డీడీల విషయం తెలిసి రెవిన్యూ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈ అంశం తమకు ఏ మాత్రం సంబంధం లేనట్టు కిందిస్థాయిలో ఉండే నాలుగో తరగతి ఉద్యోగులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. తేదీలు ముగిసిన ఈ నాలుగు కోట్ల చెక్కులు, డీడీల వివాదం ఇపుడు రెవిన్యూ కార్యదర్శి సుముఖానికి చేరింది. దీనికి పరిష్కారం ఆయనైనా ఏం చెప్పగలరు? నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపడం తప్ప!
Advertisement