ఆర్టీసీ సమ్మెపై చంద్రబాబు సీరియస్
కడప: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు చాలా సీరియస్‌గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు పెళ్ళిళ్ళు జరుగుతుండగా మరోవైపు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయని… ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం ఏ మాత్రం సమంజసంగా లేదని ఆయన అన్నారు. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు సహకారం అందిస్తుందని, కష్టాల్లో ఉన్నప్పటికీ ఇటీవల నిధులు కూడా ఇచ్చామని ఆయన […]
Advertisement
కడప: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు చాలా సీరియస్‌గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు పెళ్ళిళ్ళు జరుగుతుండగా మరోవైపు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయని… ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం ఏ మాత్రం సమంజసంగా లేదని ఆయన అన్నారు. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు సహకారం అందిస్తుందని, కష్టాల్లో ఉన్నప్పటికీ ఇటీవల నిధులు కూడా ఇచ్చామని ఆయన చెప్పారు. 27 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామంటే అంగీకరించి విధుల్లో కొనసాగాల్సింది పోయి 43 శాతం ఫిట్‌మెంట్ కోసం పట్టుబట్టడం సరికాదని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా సమ్మె బాట వీడి విధుల్లో చేరాలని ఆయన సూచించారు.
చంద్రబాబు ఈ ప్రకటన చేశారో లేదో హైదరాబాదోలో కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. యూనియన్ నాయకులకు ఇస్తున్న సౌకర్యాలను ఉపసంహరించింది. డిపో స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్మిక సంఘాల నాయకులు అనుభవిస్తున్న సౌకర్యాలను ఉపసంహరిస్తున్నట్టు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు దీనికి భిన్నమైన వైఖరి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఎర్రబెల్లి ఏకంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులతోపాటు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సమ్మెకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండు చేశారు.
Advertisement