సీఎం రమేశ్ కు చంద్రబాబు ఝలక్..
కడప: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఝులక్ ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులతో చంద్రబాబు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్‌కు ఆయన ఝలక్ ఇచ్చారు. ఢిల్లీలో ఉంటున్నావా, గ్రామాల్లో ఉంటున్నావా అంటూ రమేశ్‌ను ప్రశ్నించారు. సొంత జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే మీకు ఓట్లు ఎలా వస్తాయంటూ నిలదీశారు. అధికారుల సమక్షంలో అధినేత ఒక్కసారిగా నిలదీయడంతో సీఎం రమేశ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ బాబు అందుకు […]
Advertisement
కడప: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఝులక్ ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులతో చంద్రబాబు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్‌కు ఆయన ఝలక్ ఇచ్చారు. ఢిల్లీలో ఉంటున్నావా, గ్రామాల్లో ఉంటున్నావా అంటూ రమేశ్‌ను ప్రశ్నించారు. సొంత జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే మీకు ఓట్లు ఎలా వస్తాయంటూ నిలదీశారు. అధికారుల సమక్షంలో అధినేత ఒక్కసారిగా నిలదీయడంతో సీఎం రమేశ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ బాబు అందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రజల్లో ఉంటేనే పార్టీ బతుకుతుందని, పార్టీకి ఆదరణ ఉంటే నాయకులు మనగలుగుతారని, అప్పుడే ఓట్లు వస్తాయని రమేశ్‌కు చంద్రబాబు హితబోధ చేశారు. దీంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు.
Advertisement