ప్రత్యేకహోదా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతికూలతలున్నా ప్రయత్నిస్తూనే ఉన్నానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఇది గంభీరమైన సమస్య… లోతైన సమస్య… దీన్ని రాజకీయం చేయడం మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశానికి చట్టబద్దత కల్పించి ఉంటే ఈరోజు ఇది సమస్యగా మారేది కాదని, కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి బీజేపీని నిందించడం సరికాదని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాత […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతికూలతలున్నా ప్రయత్నిస్తూనే ఉన్నానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఇది గంభీరమైన సమస్య… లోతైన సమస్య… దీన్ని రాజకీయం చేయడం మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశానికి చట్టబద్దత కల్పించి ఉంటే ఈరోజు ఇది సమస్యగా మారేది కాదని, కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి బీజేపీని నిందించడం సరికాదని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అయినా తాను అవకాశం దొరికినప్పుడల్లా ఆర్థికమంత్రితోను, హోం మంత్రితోను మాట్లాడుతూనే ఉన్నానని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూనే ఉందని వెంకయ్య తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండు చేసే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందని, అయితే దీన్ని రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు.
Advertisement