వెంకయ్య ప్రకటన ఎంతో వింత: జేడీ శీలం
ప్రత్యేక హోదాపై విభజన చట్టంలో లేనందునే తమకు సమస్యలొస్తున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పడం వింతగా ఉందని మాజీ కేంద్ర మంత్రి జె.డి.శీలం అన్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎన్నో అంశాలను విభజన చట్టంలో పొందుపరిచిందని, అవన్నీ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలు, వైద్య సంస్థలు, ప్రాజెక్టులు, అభివృద్ధికి దోహదపడే పథకాలు ఉన్నాయని… ఇవన్నీ ఇంతవరకు ఎందుకు అమలుకు నోచుకోలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ […]
Advertisement
ప్రత్యేక హోదాపై విభజన చట్టంలో లేనందునే తమకు సమస్యలొస్తున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పడం వింతగా ఉందని మాజీ కేంద్ర మంత్రి జె.డి.శీలం అన్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎన్నో అంశాలను విభజన చట్టంలో పొందుపరిచిందని, అవన్నీ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలు, వైద్య సంస్థలు, ప్రాజెక్టులు, అభివృద్ధికి దోహదపడే పథకాలు ఉన్నాయని… ఇవన్నీ ఇంతవరకు ఎందుకు అమలుకు నోచుకోలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ కలిసే ప్రత్యేక హోదాపై నాటకాలాడుతున్నాయని, ఈ హొదా గురించి రాజకీయ పార్టీలను అడగొద్దని చెప్పడం వింతగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రజలే రోడ్ల మీదకు వచ్చి పోరాడే సమయం ఎంతదూరంలో లేదని శీలం హెచ్చరించారు.
Advertisement