ప్రభుత్వాలపై మిలిటెంట్ పోరాటాలకు మావోల నేత పిలుపు
ఆర్టీసీ కార్మికుల పోరాటాలకు అండగా ఉంటామని, అన్ని వర్గాల ప్రజలూ మద్దతు తెలపాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. సామాన్యుల ఇబ్బందులకు ప్రభుత్వాల దోపిడీ విధానాలే కారణమని, ఈవిషయాన్ని అర్థంచేసుకుని అన్నివర్గాల ప్రజలు మోడీ, కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలపై మిలిటెంట్ పోరాటాలు చేయాలని పిలుపు ఇచ్చారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చరిత్ర ఆర్టీసీ […]
Advertisement
ఆర్టీసీ కార్మికుల పోరాటాలకు అండగా ఉంటామని, అన్ని వర్గాల ప్రజలూ మద్దతు తెలపాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. సామాన్యుల ఇబ్బందులకు ప్రభుత్వాల దోపిడీ విధానాలే కారణమని, ఈవిషయాన్ని అర్థంచేసుకుని అన్నివర్గాల ప్రజలు మోడీ, కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలపై మిలిటెంట్ పోరాటాలు చేయాలని పిలుపు ఇచ్చారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉంది. స్వరాష్ట్రం ఏర్పడి 10 నెలలు గడిచినా ఇంతవరకూ వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్‌ను కూడా ఈ ప్రభుత్వం అంగీకరించట్లేదు. కలెక్టర్లకు ఫార్చునర్ వాహనాలు, పోలీసులకు అధునాతన వాహనాలు, పరిహారాలు లక్షలకు లక్షలు పెంచుతున్న టి-సర్కారు కార్మికులకు కుటుంబాన్ని పోషించుకునే వేతనాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. సచివాలయంలో పనిచేసే డ్రైవర్లకు ఒకరమైన వేతనాలు ఇస్తూ, ప్రజలకు సేవ చేసే ఆర్టీసీ కార్మికులకు కుటుంబాన్ని పోషించే వేతనం కూడా ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వానికి కార్మికులపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తున్నదన్నారు.
Advertisement