గోమూత్రంతో ఆస్ప‌త్రుల శుద్ధి

యాసిడ్లు, ఫినాయిళ్ళ క‌న్నా గో మూత్రం చాలా భేష‌యినదని భావిస్తోంది భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్ర‌భుత్వం. అందుకే ప్ర‌జ‌లు ఆల‌యాలుగా భావించే ఆస్ప‌త్రుల శుద్ధికి ఇక గో మూత్రం వాడాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది ప్ర‌భుత్వం. కేంద్రానికి వ‌చ్చిన ఆ ఆలోచ‌న‌ను కార్య‌రూపంలోకి తీసుకురావ‌డానికి   రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ముంద‌డుగేసింది. జైపూర్‌లోని ఓ ఆస్ప‌త్రిలో దీన్ని అమ‌లు చేసి ఫ‌లితాలు ప‌రిశీలించిన త‌ర్వాత రాష్ట్రమంతా విస్త‌రించాల‌ని యోచిస్తోంది. నిజానికి ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర మంత్రి, జంతు సంర‌క్ష‌ణ ప్రేమికురాలు మేన‌కాగాంధీ […]

Advertisement
Update:2015-05-07 05:15 IST
యాసిడ్లు, ఫినాయిళ్ళ క‌న్నా గో మూత్రం చాలా భేష‌యినదని భావిస్తోంది భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్ర‌భుత్వం. అందుకే ప్ర‌జ‌లు ఆల‌యాలుగా భావించే ఆస్ప‌త్రుల శుద్ధికి ఇక గో మూత్రం వాడాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది ప్ర‌భుత్వం. కేంద్రానికి వ‌చ్చిన ఆ ఆలోచ‌న‌ను కార్య‌రూపంలోకి తీసుకురావ‌డానికి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ముంద‌డుగేసింది. జైపూర్‌లోని ఓ ఆస్ప‌త్రిలో దీన్ని అమ‌లు చేసి ఫ‌లితాలు ప‌రిశీలించిన త‌ర్వాత రాష్ట్రమంతా విస్త‌రించాల‌ని యోచిస్తోంది. నిజానికి ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర మంత్రి, జంతు సంర‌క్ష‌ణ ప్రేమికురాలు మేన‌కాగాంధీ గ‌త మార్చిలోనే ప్ర‌తిపాదించారు. గోమూత్రం అన‌గానే వికారం, ఏవ‌గింపు క‌ల‌గొచ్చు… కానీ ఆస్ప‌త్రుల శుద్ధికి ఫినాయిల్‌, యాసిడ్లు వాడ‌కాన్ని మ‌నం గుర్తు పెట్టుకోవాలి. అలా చూసిన‌పుడు గోమూత్రంతో క‌డ‌గ‌డం అనేది త‌క్కువ ప్ర‌మాద‌క‌ర‌మే కాదు… అతి ఉప‌యోగ‌క‌ర‌మైన ప‌ని కూడా అవుతుంది… అని మేన‌కాగాంధీ అన్నారు. గోమూత్రంలో వేప‌, దేవ‌దారు ఆకుల‌ను క‌లుపుతామ‌ని, దానివ‌ల్ల మూత్రం నుంచి వ‌చ్చే దుర్గంధం పోతుంద‌ని రాజ‌స్థాన్ ఆరోగ్య మంత్రి రాజేంద్ర రాథోడ్ తెలిపారు.
Tags:    
Advertisement

Similar News