సల్మాన్‌కు ఐదేళ్ళ జైలు... తాత్కాలిక బెయిలు

     స‌ల్మాన్ అభిమానుల‌కు, కుటుంబస‌భ్యుల‌కు ఈరోజు ఒక చీక‌టి రోజు. హిట్ అండ్ ర‌న్ కేసులో బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ముంబాయి సెష‌న్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఉద‌యం ఆయ‌న్ను దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌న్న‌ర స‌మ‌యంలో ఆయ‌న‌కు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. స‌ల్మాన్‌ఖాన్ సేవా కార్య‌క్ర‌మాల‌ను దృష్టిలో పెట్టుకుని ఐదేళ్ళ శిక్ష విధించిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌పై పెట్టిన సెక్ష‌న్లు దృష్టిలో పెట్టుకుంటే ప‌దేళ్ళ […]

Advertisement
Update:2015-05-06 12:45 IST
స‌ల్మాన్ అభిమానుల‌కు, కుటుంబస‌భ్యుల‌కు ఈరోజు ఒక చీక‌టి రోజు. హిట్ అండ్ ర‌న్ కేసులో బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ముంబాయి సెష‌న్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఉద‌యం ఆయ‌న్ను దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌న్న‌ర స‌మ‌యంలో ఆయ‌న‌కు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. స‌ల్మాన్‌ఖాన్ సేవా కార్య‌క్ర‌మాల‌ను దృష్టిలో పెట్టుకుని ఐదేళ్ళ శిక్ష విధించిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌పై పెట్టిన సెక్ష‌న్లు దృష్టిలో పెట్టుకుంటే ప‌దేళ్ళ వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. కాని ఆయ‌న‌కు న్యాయ‌మూర్తి దేశ్‌పాండే ఐదేళ్ళ జైలు శిక్ష‌ను మాత్ర‌మే విధించారు. ముంబాయి సెషన్స్ కోర్టు తీర్పుపై సల్మాన్ ఖాన్ న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి తుది తీర్పు కాపి తమకింకా అందలేదు కాబట్టి బెయిల్ మంజూరు విషయంలో నిర్ణయం తీసుకోలేమని అంతవరకు రెండు రోజులపాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తామని మధ్యంతర ఉత్తర్వు ఇచ్చారు. సెష‌న్స్ కోర్టు మూడేళ్ళ‌కు పైగా శిక్ష విధించినందువ‌ల్ల ఆయ‌న బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం లేకుండా పోయింది. 2002లో స‌ల్మాన్ ఇదే కేసులో 18 రోజుల జైలు శిక్ష అనుభ‌వించారు.
2002 సెప్టెంబ‌ర్ 28న స‌ల్మాన్ కారు మీతిమీరిన వేగంతో న‌డుపుతూ ఒక‌రి మృతికి మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ‌డానికి కార‌ణ‌మైన‌ట్టు జ‌డ్జి త‌న తీర్పులో పేర్కొన్నారు. 13 సంవ‌త్స‌రాలుగా కొన‌సాగిన ఈ కేసులో మొత్తం 28 మంది సాక్ష్యుల‌ను విచారించారు. వీరిలో ఒక్క‌రు మాత్ర‌మే స‌ల్మాన్‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్ప‌గా మిగిలిన వారంతా వ్య‌తిరేకంగా సాక్ష్యాలు చెప్పారు. కారు న‌డిపిన స‌మ‌యంలో స‌ల్మాన్ తాగి ఉన్నార‌న్న విష‌యం ప్రాసిక్యూష‌న్ నిరూపించింది. స‌ల్మాన్‌పై యాక్సిడెంట్‌కు కార‌ణం అయ్యారంటూ 134 సెక్ష‌న్‌ను, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు 187, జ‌నం తిరిగే ప్రాంతాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు 279, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా న‌డిపినందుకు 3 (1) సెక్ష‌న్‌ను, ప్ర‌మాదం చేసి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసినందుకు 185 సెక్ష‌న్‌లు న‌మోదు చేశారు. మొత్తం ఎనిమిది అభియోగాలు నిరూపిత‌మ‌య్యాయ‌ని న్యాయ‌మూర్తి దేశ్‌పాండే తెలిపారు. కేసు చివ‌రిద‌శ‌లో డ్రైవ‌ర్ అశోక్‌సింగ్ కారు న‌డిపాడ‌ని స‌ల్మాన్ లాయ‌ర్ వాద‌న‌తో న్యాయ‌మూర్తి విభేదించారు.
ఉద‌యం తీర్పు పాఠం చ‌దివే స‌మ‌యంలో స‌ల్మాన్‌పై న్యాయ‌మూర్తి ప్ర‌శ్న‌ల వర్షం కురిపించారు. నీవు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా ప్ర‌మాదం చేసి ఉండ‌క‌పోవ‌చ్చు. కాని త‌ప్ప‌తాగి కారు న‌డ‌ప‌డం త‌ప్పు కాదా? అంటూ ప్ర‌శ్నించారు. నీవు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు న‌డిపావు. అది త‌ప్పు కాదా? నీవు చేసిన ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు… న‌లుగురు గాయ‌ప‌డ్డారు… దీనికి నీకు ప‌దేళ్ళు శిక్ష ప‌డుతుంద‌ని తెలుసా? అని అడిగారు. ఇంకా ఏమైనా చెప్ప‌ద‌ల‌చుకున్నావా? అని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించిన‌పుడు స‌ల్మాన్ మౌనంగా త‌ల‌దించుకుని ఉండిపోయారు. కోర్టు హాలులోనే ఆయ‌న క‌న్నీళ్ళు పెట్టుకున్నారు. జ‌డ్జి వైపు చూస్తూ మౌనంగా స‌ల్మాన్ ఉండిపోవ‌డం చూసి కుటుంబ‌స‌భ్యులు నిశ్చేష్ఠుల‌య్యారు. న్యాయ‌మూర్తి తీర్పు పాఠాన్ని చ‌దివి వెళ్ళిన త‌ర్వాత స‌ల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న్ని స‌ర్ అర్ధ‌ర్ రోడ్డు జైలుకు త‌ర‌లించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.
Also Read హిట్ ర‌న్ కేసులో స‌ల్మాన్ దోషి… కోర్టు నిర్దార‌ణ‌
Tags:    
Advertisement

Similar News