మిషన్ కాకతీయకు రూ.50 లక్షల విరాళం
తెలంగాణ ప్రభుత్వం జల వనరుల సిరి… మిషన్ కాకతీయకు దండిగా విరాళాలు వస్తున్నాయి. వేలాది చెరువుల్లో పూడికతీత లక్ష్యంగా పెట్టుకుని కొనసాగిస్తున్న ఈ మిషన్‌కు నల్గొండ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడు పైళ్ళ మల్లారెడ్డి తన గ్రామంలోని చెరువుల పునరుద్దరణకు రూ. 50 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని అందజేయడానికి ఆయన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావును కలిశారు. మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, దీనికి తనవంతు సాయంగా రూ. 50 […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వం జల వనరుల సిరి… మిషన్ కాకతీయకు దండిగా విరాళాలు వస్తున్నాయి. వేలాది చెరువుల్లో పూడికతీత లక్ష్యంగా పెట్టుకుని కొనసాగిస్తున్న ఈ మిషన్‌కు నల్గొండ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడు పైళ్ళ మల్లారెడ్డి తన గ్రామంలోని చెరువుల పునరుద్దరణకు రూ. 50 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని అందజేయడానికి ఆయన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావును కలిశారు. మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, దీనికి తనవంతు సాయంగా రూ. 50 లక్షలు అందిస్తున్నానని మల్లారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలంలోని సుంకిశాల, పులిగిళ్ళలో ఉన్న చెరువుల మరమ్మతు కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించాలని ఆయన మంత్రిని కోరారు. విరాళం అందుకున్న మంత్రి హరీష్‌రావు… మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement