14 నుంచి మోదీ చైనా పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 14 -19 వరకు ఆయన చైనా, మంగోలియా, దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. 14-16 తేదీల్లో చైనాలోని షాంఘై, బీజింగ్ నగరాల్లో పర్యటించనున్నానని మోదీ తన మైక్రోబ్లాగ్ వెబ్‌సైట్ వీబోలో రాసుకున్నారు. చైనా పర్యటనపై తానెంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. రెండు చారిత్రక నేపథ్యం కలిగిన దేశాల మధ్య సంబంధాలను ఈ పర్యటన మరింత మెరుగు పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతవిదేశాంగ శాఖ కూడా మంగళవారం […]
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 14 -19 వరకు ఆయన చైనా, మంగోలియా, దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. 14-16 తేదీల్లో చైనాలోని షాంఘై, బీజింగ్ నగరాల్లో పర్యటించనున్నానని మోదీ తన మైక్రోబ్లాగ్ వెబ్‌సైట్ వీబోలో రాసుకున్నారు. చైనా పర్యటనపై తానెంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. రెండు చారిత్రక నేపథ్యం కలిగిన దేశాల మధ్య సంబంధాలను ఈ పర్యటన మరింత మెరుగు పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతవిదేశాంగ శాఖ కూడా మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మోదీ 14-16 వరకు చైనా సందర్శిస్తారని అక్కడ ఆ దేశాధినేతతో జరిగే ద్వైపాక్షిక చర్చలతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. చైనాలోని భారతీయులు ఘనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోదీ ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొంది. మిగిలిన 3 రోజులు మంగోలియా, దక్షిణ కొరియాల్లో పర్యటిస్తారని వివరించింది.
Advertisement