అలాంటి మగవాళ్లని కాల్చి పడేయాలి.... నటి జ్యోతిక
చిన్న చిన్న మాటలు, అభిప్రాయాలతో కూడా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అయితే ఆ మాటలను ఆ మనిషి నిజాయితీగా చెప్పాలి. ఇక్కడ నటి జ్యోతిక అలాంటి మనోభావాలనే నిజాయితీగా, మనసు విప్పి వెల్లడించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…. నా సంతోషానికి అర్థం చెప్పమంటే… వారానికి ఒక రోజంతా నాకు నచ్చినట్టుగా ఉంటాను. నాకు ఇష్టమైన పనులు మాత్రమే చేస్తాను. వర్కవుట్లు చేస్తాను, సినిమా చూస్తాను, స్నేహితులతో కలిసి కాఫీ తాగుతాను, మ్యూజిక్ వింటాను, రొమాంటిక్ డిన్నర్ చేస్తాను. నేను చాలా భయపడే […]
చిన్న చిన్న మాటలు, అభిప్రాయాలతో కూడా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అయితే ఆ మాటలను ఆ మనిషి నిజాయితీగా చెప్పాలి. ఇక్కడ నటి జ్యోతిక అలాంటి మనోభావాలనే నిజాయితీగా, మనసు విప్పి వెల్లడించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే….
నా సంతోషానికి అర్థం చెప్పమంటే… వారానికి ఒక రోజంతా నాకు నచ్చినట్టుగా ఉంటాను. నాకు ఇష్టమైన పనులు మాత్రమే చేస్తాను. వర్కవుట్లు చేస్తాను, సినిమా చూస్తాను, స్నేహితులతో కలిసి కాఫీ తాగుతాను, మ్యూజిక్ వింటాను, రొమాంటిక్ డిన్నర్ చేస్తాను.
నేను చాలా భయపడే విషయం…. విమాన ప్రమాదంలో మాకేమైనా అవుతుందేమోనని…ఎప్పుడూ నా పిల్లల ఆరోగ్యం కోసం దేవుని ప్రార్ధిస్తుంటాను.
నేను బాగా ఆరాధించే వ్యక్తి మదర్ థెరిసా. నిస్వార్ధంగా ఇతరులకు సేవ చేయడాన్నిమించిన ఔన్నత్యం జీవితంలో మరొకటి ఉండదు.
జీవించి ఉన్న వ్యక్తుల్లో నేను బాగా ఇష్టపడే వ్యక్తి అమ్మ (జయలలిత). ఆమె మహిళా శక్తికి ప్రతిరూపం. మన దేశాన్ని గర్వపడేలా చేసిన సైనా నెహ్వాల్ అన్నా ఇష్టమే.
నేను మార్చుకోవాలనుకుంటున్న నా లక్షణం ఒకటి… నిజజీవితంలో కాస్త నటించడం నేర్చుకోవాలని. నా ముఖం నా మనసుకి అద్దం. మనసులోని భావోద్వేగాలను ఏ మాత్రం దాచలేను. వాటిని నియంత్రించగలగాలి.
ఇతరుల్లో నాకు నచ్చని విషయం సమయానికి విలువ ఇవ్వక పోవటం, అనవసరమైన వినయాలు, మర్యాదలు సైతం నచ్చవు. మంచైనా, చెడైనా మొహంమీదే చెప్పేయడం నా అలవాటు. స్పోర్ట్స్ దుస్తులమీద ఎక్కువ ఖర్చు పెడుతుంటాను. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ, క్లోజ్ ఫ్రెండ్స్ కోసం కూడా షాపింగ్ చేసేస్తుంటాను.
వెనక్కు వెళ్లి బాల్యంలోని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవటం చాలా ఇష్టం. నా పిల్లల్లో నా బాల్యాన్ని వెతుక్కుంటాను. ముఖ్యంగా పిల్లలకు స్కూల్లో స్పోర్ట్స్ డే నాడు…ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు నన్ను అల్లుకుంటాయి.
మా అబ్బాయి దేవ్ నాకు నచ్చిన చిత్రకారుడు. అయిదేళ్ల అతి గొప్ప చిత్రకారుడు. ఆ బొమ్మలను నేను చాలా భద్రంగా దాచుకుంటాను.
సినీనటుల జీవితాలపై ఇతరులు చర్చించుకోవటం నాకు నచ్చదు. అందరిలాగా వారికీ వ్యక్తిగత జీవితాలుంటాయి. మీడియాకు. పబ్లిక్ ఫంక్ష్లన్లకు దూరంగా ఉండటానికి అబద్దాలు ఆడుతుంటాను.
నా రూపంలో నాకు నచ్చనిది ఏమీ లేదు. ఏ కృత్రిమ మార్పులు…అంటే సర్జరీలద్వారా మార్చుకున్నది ఏదీ లేని, నా పట్ల నేను గర్వంగా ఫీలవుతున్న 36 సంవత్సరాల మహిళను.
చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేసే మగవాళ్లంటే అసహ్యం. అలాంటివారిని నిలబెట్టి కాల్చేయాలి. ఆసమ్, గాడ్ బ్లెస్ నేను తరచుగా వాడే పదాలు.
నేను బాగా బాధపడే విషయం ముంబయిలో ఉన్న నా తల్లి దండ్రులతో సమయం గడపలేకపోవటం, వారిని బాగా మిస్సవుతున్నా.
జీవితంలో బాగా ప్రేమించే మనుషులు సూర్య, పిల్లలు, స్నేహితులు, ఇష్టమైనవి చాక్‌లెట్లు.
నేను చాలా ఆనందించిన సమయం…కొద్ది రోజుల క్రితం నా ఎనిమిదేళ్ల కూతురు నాకు ఉత్తరం రాసినపుడు. నేను తనకు ఎంతముఖ్యమో అందులో రాస్తూ, నాకు ప్రపంచంలోనే అతి గొప్ప తల్లిగా కితాబునిచ్చింది.
ప్రస్తుతం నా మనోస్థితి….చాలా తృప్తిగా ఉన్నా. లోపలినుండి ఆనందంగా ఉన్నా.
విమాన ప్రమాదంలో కాకుండా ఎలా మరణించినా ఓకే….అయితే సూర్యకంటే ముందు….. నాకు నచ్చిన జీవన సిద్ధాంతం…నీ గతం అసూయ పడేలా నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకో.