దావూద్ ఎక్కడున్నాడో తెలియదు: కేంద్రం
మాఫియా డాన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలియదని కేంద్రం వెల్లడించింది. దావూద్ ఆచూకీ తెలపాలని అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరతిభాయ్ మంగళవారం లోక్‌సభకు ఈ విధంగా సమాధానం తెలిపారు. అతని ఆచూకీపై స్పష్టమైన సమాచారం వస్తే వెంటనే పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. దావూద్‌పై ఇప్పటికే రెడ్‌కార్నర్ జారీ చేశామని, భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో కూడా ఉన్నాడని తెలిపారు. […]
Advertisement
మాఫియా డాన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలియదని కేంద్రం వెల్లడించింది. దావూద్ ఆచూకీ తెలపాలని అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరతిభాయ్ మంగళవారం లోక్‌సభకు ఈ విధంగా సమాధానం తెలిపారు. అతని ఆచూకీపై స్పష్టమైన సమాచారం వస్తే వెంటనే పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. దావూద్‌పై ఇప్పటికే రెడ్‌కార్నర్ జారీ చేశామని, భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో కూడా ఉన్నాడని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సైతం అతినిపై ప్రత్యేక నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. 1993 పేలుళ్ల తరువాత దావూద్ దేశం విడిచి పారిపోయాడు. దుబాయ్‌లో ఆశ్రయం పొందాడు. దుబాయ్‌పై భారత్ ఒత్తిడి చేయడంతో పాకిస్థాన్‌కు మకాం మార్చాడు. దావూద్‌ను అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తులను పాక్ పెడచెవిన పెడుతోంది. ఎందుకంటే పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ ఐ దావూద్‌కు పాకిస్తాన్‌లో రక్షణతో కూడిన ఆశ్రయం కల్పిస్తోంది. ఇందుకు ప్రతిగా ఇండియాలో ఉన్న దావూద్ నెట్‌వర్క్‌తో విధ్వంసాలకు ప్రణాళికలు రచిస్తోంది.
Advertisement