గార్డెన్ సిటీలో ఏసీ మరుగుదొడ్లు!
గార్డెన్ సిటీని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు బెంగుళూరు నగర పాలక సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని మహాలక్ష్మీ లేఅవుట్ ప్రధాన వీధిలో అత్యాధునికంగా ఎయిర్ కండిషన్డ్ మరుగుదొడ్డిని నిర్మించారు. విలాసవంతమైన హోటల్‌లోని మరుగుదొడ్డికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇది ఉంది. మరుగుదొడ్డి ఏసీది అయినప్పటికీ అదనంగా రుసుములేమీ వసూలు చేయడం లేదు. ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉన్న మెజిస్టిక్, మడివాళలోని మరుగుదొడ్లలో కూడా ఏసీలను బిగిస్తున్నారు. త్వరలోనే ఎంపిక చేసిన మరో […]
Advertisement
గార్డెన్ సిటీని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు బెంగుళూరు నగర పాలక సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని మహాలక్ష్మీ లేఅవుట్ ప్రధాన వీధిలో అత్యాధునికంగా ఎయిర్ కండిషన్డ్ మరుగుదొడ్డిని నిర్మించారు. విలాసవంతమైన హోటల్‌లోని మరుగుదొడ్డికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇది ఉంది. మరుగుదొడ్డి ఏసీది అయినప్పటికీ అదనంగా రుసుములేమీ వసూలు చేయడం లేదు. ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉన్న మెజిస్టిక్, మడివాళలోని మరుగుదొడ్లలో కూడా ఏసీలను బిగిస్తున్నారు. త్వరలోనే ఎంపిక చేసిన మరో 23 మరుగుదొడ్డలో ఈ సదుపాయాన్ని కల్పిస్తామని వీటి నిర్వహణను చూస్తున్న విశాల్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఒక్కో మరుగుదొడ్డిలో ఏసీ బిగించడానికి సంబంధిత ఇతర పనులకు లక్ష రూపాయల వ్యయమవుతుందని వారు తెలిపారు. ఏసీలు ఉన్నాయన్న స్పృహతోనైనా వీధి మరుగుదొడ్లను జనం, నగరపాలక సిబ్బంది పరిశుభ్రంగా నిర్వహిస్తారని భావిస్తున్నట్టు విశాల్ సంస్థ ప్రతినిధులు చెప్పారు.
Advertisement