భోగాపురంపై వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం

విజయనగరం : భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి 15 వేల ఎకరాలు సేకరిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం వెనక్కితగ్గింది. ప్రజల నిరసనలు.. పార్టీల ఆందోళనలు… టీడీపీ ప్రజాప్రతినిధుల వినతుల నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆరు పంచాయతీల పరిధిలో ఆరు వేల ఎకరాలను మాత్రమే సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత నెల 30న విశాఖలో సీఎం చంద్రబాబునాయుడిని కలసిన ఎమ్మెల్యే పతివాడతోపాటు భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాలకు చెందిన టీడీపీ […]

Advertisement
Update:2015-05-03 18:43 IST
విజయనగరం : భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి 15 వేల ఎకరాలు సేకరిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం వెనక్కితగ్గింది. ప్రజల నిరసనలు.. పార్టీల ఆందోళనలు… టీడీపీ ప్రజాప్రతినిధుల వినతుల నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆరు పంచాయతీల పరిధిలో ఆరు వేల ఎకరాలను మాత్రమే సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత నెల 30న విశాఖలో సీఎం చంద్రబాబునాయుడిని కలసిన ఎమ్మెల్యే పతివాడతోపాటు భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాలకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఇక్కడి పరిస్థితిని వివరించి విమానాశ్రయానికి సమీకరించాలనుకుంటున్న భూమి విషయంలో పునరాలోచించకపోతే కష్టమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నివేదిక అందజేయాలని ఉత్తరాంధ్ర మంత్రుల‌ను సీఎం ఆదేశించారు. అన్ని వివ‌రాలు కూలంక‌షంగా చ‌ర్చించిన త‌ర్వాత ఎయిర్‌పోర్టు భూ సేక‌ర‌ణ‌ను 15 వేల నుంచి ఆరు వేల ఎక‌రాల‌కు త‌గ్గించారు.
Tags:    
Advertisement

Similar News