హీరో శివాజీ దీక్షల వెనక రహస్యమేంటి?
రాజకీయ నాయకుడు అవ్వాలన్న కోరిక హీరో శివాజీలో కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఎలాగైనా ప్రజానేత అనిపించుకోవడానికి ఆయన పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. కొంతకాలంగా ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్న ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టారు. 2013, అక్టోబరులో పాలమూరు జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటనలో దాదాపు 40 మంది మరణించినప్పటి నుంచి శివాజీ ప్రజా సమస్యలపై గళం విప్పడం […]
Advertisement
రాజకీయ నాయకుడు అవ్వాలన్న కోరిక హీరో శివాజీలో కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఎలాగైనా ప్రజానేత అనిపించుకోవడానికి ఆయన పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. కొంతకాలంగా ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్న ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టారు. 2013, అక్టోబరులో పాలమూరు జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటనలో దాదాపు 40 మంది మరణించినప్పటి నుంచి శివాజీ ప్రజా సమస్యలపై గళం విప్పడం మొదలుపెట్టారు. తరువాత పాలెం బస్సు బాధితులకు నష్టపరిహారం కోసమంటూ హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అప్పట్లో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇదే ప్రశ్న విలేకరులు అడిగితే సమాధానం దాటవేశారు. మరో హీరో సురేష్ తో కలిసి రాష్ర్ట విభజన అన్యాయం అంటూ యూట్యూబ్‌లో హల్‌చల్ చేశారు. దీంతో శివాజీ బీజేపీ నేతగా ప్రచారం జరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో మనోడి ప్లాన్ వర్క్ అవుట్ కాకపోవడంతో ఎక్కడా టికెట్ దక్కలేదు. ఎన్నికల అనంతరం మోదీ కలల ప్రాజెక్టు స్వచ్ఛభారత్‌కు ప్రచారం కూడా చేశారు. అదే సమయంలో జాతీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని బీజేపీ నేతలు ఆగ్రహించారు. దీనిపై ఏపీ బీజేపీ స్పందించి ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇటీవల రాజమండ్రిలో ఓ హోటల్‌లో బస చేసిన శివాజీని బయటికి వచ్చితమ నేతలపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. గత్యంతరం లేక బయటికి వచ్చి క్షమాపణ చెప్పారు. ఇప్పడు ప్రత్యేకహోదా కోసం మరోసారి ఇలా.. ఉద్యమబాట పట్టారు.
Advertisement