ఇక పై తత్కాల్ రైళ్లు
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్- విశాఖపట్నం, హైదరాబాద్-విశాఖపట్నం మధ్య మొత్తం నాలుగు తత్కాల్ రైలు సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. హైదరాబాద్-విశాఖపట్నం స్పెషల్ (రైలు నెంబర్ 02740) ఈనెల 8న, సికింద్రాబాద్- విశాఖపట్నం స్పెషల్ (రైల్ నెంబర్ 02728) ఈనెల 10న బయలుదేరి, తిరిగి విశాఖలో 9, 11న బయలుదేరుతాయి. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్టు […]
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్- విశాఖపట్నం, హైదరాబాద్-విశాఖపట్నం మధ్య మొత్తం నాలుగు తత్కాల్ రైలు సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. హైదరాబాద్-విశాఖపట్నం స్పెషల్ (రైలు నెంబర్ 02740) ఈనెల 8న, సికింద్రాబాద్- విశాఖపట్నం స్పెషల్ (రైల్ నెంబర్ 02728) ఈనెల 10న బయలుదేరి, తిరిగి విశాఖలో 9, 11న బయలుదేరుతాయి. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్టు కుమార్ చెప్పారు. వీటితో పాటు రద్దీ మార్గాలైనా తిరుపతి, బెంగుళూరు, చెన్నై నగరాలకు కూడా రాబోవు కాలంలో విస్తరింబోతున్నట్టు సమాచారం