`దావూద్ లొంగుబాటుపై సీబీఐలో రగడ!
కరడుగట్టిన నేరగాడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం వ్యవహారం ఇపుడు ఇద్దరు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ అధికారుల మద్య చిచ్చు రేపింది. దావూద్ ఇబ్రహిం లొంగిపోతానంటే ఆనాటి సీబీఐ డైరెక్టర్ విజయ రామారావు అంగీకరించలేదని మరో మాజీ సీబిఐ డిఐజీ నీరజ్ కుమార్ ఆరోపించారు. ముంబాయి వరుస పేలుళ్ళు సంభవించిన 15 నెలల తర్వాత దావూద్ లొంగిపోతానని తనకు చెప్పాడని, ఈ విషయంపై మూడుసార్లు తనకు ఫోన్ చేశాడని ఆయన తెలిపారు. అయితే […]
Advertisement
కరడుగట్టిన నేరగాడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం వ్యవహారం ఇపుడు ఇద్దరు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ అధికారుల మద్య చిచ్చు రేపింది. దావూద్ ఇబ్రహిం లొంగిపోతానంటే ఆనాటి సీబీఐ డైరెక్టర్ విజయ రామారావు అంగీకరించలేదని మరో మాజీ సీబిఐ డిఐజీ నీరజ్ కుమార్ ఆరోపించారు. ముంబాయి వరుస పేలుళ్ళు సంభవించిన 15 నెలల తర్వాత దావూద్ లొంగిపోతానని తనకు చెప్పాడని, ఈ విషయంపై మూడుసార్లు తనకు ఫోన్ చేశాడని ఆయన తెలిపారు. అయితే ఇందుకు సీబీఐ పెద్దలు ఒప్పుకోలేదని ఆయన అన్నారు. ఈ విషయమై సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మాట్లాడుతూ నీరజ్ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు. తనకెప్పుడూ ఆ విషయం చెప్పలేదని అన్నారు. విధుల్లో తానెప్పుడూ రాజీ పడలేదని… దావూద్‌ను పట్టుకునేందుకు మూడు యేళ్ళు కష్టపడ్డామని మాజీ డైరెక్టర్ తెలిపారు. కింది స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చి ఉంటే తనకు ఆ విషయం తెలియదని రామారావు అన్నారు.
Advertisement