ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం: బొత్స
విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాకులు చెప్పడం సరికాదన్నారు. తాను కాంగ్రెస్‌ను వదిలి ఇతర పార్టీల వైపు చూస్తున్నానన్నది వాస్తవం కాదని ఆయన అన్నారు. అయితే రాజకీయ మనుగడ కూడా చూసుకోవాలి కదా అని తనదైన శైలిలో విలేకరులకు సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో సోనియాగాంధీ మాట్టాడితే ఆనాడు నోరు మెదపని పెద్దలు ఈనాడు కాంగ్రెస్ పార్టీపై […]
Advertisement
విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాకులు చెప్పడం సరికాదన్నారు. తాను కాంగ్రెస్‌ను వదిలి ఇతర పార్టీల వైపు చూస్తున్నానన్నది వాస్తవం కాదని ఆయన అన్నారు. అయితే రాజకీయ మనుగడ కూడా చూసుకోవాలి కదా అని తనదైన శైలిలో విలేకరులకు సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో సోనియాగాంధీ మాట్టాడితే ఆనాడు నోరు మెదపని పెద్దలు ఈనాడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి టీడీపీ, బీజేపీ కలిసి రాజకీయ వ్యాపారం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము ఎంతదూరం అయినా వెళతామని, దీనిపై కోర్టులో కేసు వేసేందుకు కూడా ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. పరిపాలన గాలి కొదిలి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. ఎన్నికల్లో ముడుపులు ఇచ్చిన వారి కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని బొత్స విమర్శించారు.
Advertisement