రాజధాని రైతులకు బంపర్ ఆఫర్(ట)!

తుళ్ళూరు: మండలంలోని రాజధాని గ్రామాల పొలాలు, పెరట్లో, ఇతర ప్రదేశాలలో రైతులకు సంబంధించిన టేకు, ఇతర విలువైన చెట్లు నరుక్కోవటానికి అనుమతులు ఇస్తున్నట్లు తహసీల్దార్‌ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు కార్యాలయంలో ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫారెస్ట్‌, రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులు పరిశీలించి అనుమతులు ఇస్తారని తెలిపారు. గురు, శుక్ర, శనివారాలు డెస్క్‌ పనిచేస్తుందని తెలిపారు. రైతులు అనుమతుల కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Advertisement
Update:2015-04-30 20:05 IST

Tags:    
Advertisement

Similar News