మళ్ళీ నోరు జారిన చంద్రబాబు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ఇక్కడ పర్యాటక కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మత్య్సకారులకు నష్టం వాటిల్లకుండా టూరిజం ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పుగోదావరి ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి సాధించగలదని అన్నారు. ఇక్కడ ఉన్న సహజ వనరులు మరెక్కడా లేవని, జన జీవితానికి ప్రాణాధారమైన నీరు ఇక్కడ పుష్కలంగా ఉండడం కలిసొచ్చే అంశమని అన్నారు. కాకినాడలో రెండు ఓడ రేవులు […]
Advertisement
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ఇక్కడ పర్యాటక కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మత్య్సకారులకు నష్టం వాటిల్లకుండా టూరిజం ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పుగోదావరి ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి సాధించగలదని అన్నారు. ఇక్కడ ఉన్న సహజ వనరులు మరెక్కడా లేవని, జన జీవితానికి ప్రాణాధారమైన నీరు ఇక్కడ పుష్కలంగా ఉండడం కలిసొచ్చే అంశమని అన్నారు. కాకినాడలో రెండు ఓడ రేవులు వచ్చే అవకాశం ఉందని, పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి నాలుగేళ్ళు పడుతుందని, సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఉపయోగించుకునే లక్ష్యంతోనే తాము పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఇది యేడాదిలో పూర్తవుతుందని తెలిపారు. డ్వాక్రా సంఘాల రుణాలు త్వరలో మాఫీ చేస్తామని… ఇచ్చిన మాటకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలని… ఇందుకోసం తాను నిరవధికంగా కష్టపడుతున్నానని చంద్రబాబు తెలిపారు. పనిలోపనిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలుగువారు కలిసుండేలా చేయడానికి తానో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని, తనకు ఎక్కడా కలిసి రావడం లేదని చంద్రబాబు అన్నారు. ఎంతో అహంభావంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, తెలుగేదేశం పార్టీ అనేదే లేకుంటే ఆయన ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడని ఆయన విమర్శించారు.
Advertisement