భూకంపం... 70 వేల ఇళ్ళు కనుమరుగు
నేపాల్ భూకంపం శిథిలాల నుంచి శవాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 6200 మృతదేహాలు వెలికితీశారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారు 15 వేల వరకు ఉంటారని అంచనా వేస్తున్నట్టు అధికారులు అన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం… భూకంపం దాదాపు 70 వేల ఇళ్ళను నామరూపాల్లేకుండా చేసింది. మరో 5 లక్షల 30 వేల గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విచిత్రం ఏమిటంటే… దాదాపు 128 గంటల తర్వాత ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఇంకా శిథిలాలు తీస్తూనే […]
Advertisement
నేపాల్ భూకంపం శిథిలాల నుంచి శవాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 6200 మృతదేహాలు వెలికితీశారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారు 15 వేల వరకు ఉంటారని అంచనా వేస్తున్నట్టు అధికారులు అన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం… భూకంపం దాదాపు 70 వేల ఇళ్ళను నామరూపాల్లేకుండా చేసింది. మరో 5 లక్షల 30 వేల గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విచిత్రం ఏమిటంటే… దాదాపు 128 గంటల తర్వాత ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఇంకా శిథిలాలు తీస్తూనే ఉన్నారు. ఇంకా వీటి మధ్య బతికి బట్ట కట్టినవారు ఎంతమంది ఉన్నారన్నది తేలాల్సి ఉంది. నేపాల్ చిన్న దేశమైనప్పటికీ 75 జిల్లాలున్నాయి. వీటిలో 39 జిల్లాలపై భూకంప ప్రభావం బాగా కనిపించింది.
సహాయక చర్యల్లో భారతదేశం చాలా ముందుందనే చెప్పాలి. ఈ విషయాన్ని నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా కూడా గుర్తించి కృతజ్ఞతలు చెప్పారు. బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో, సహాయక చర్యలు చేపట్టడంలో భారత్ పాత్ర శ్లాఘనీయమని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా కితాబు ఇచ్చారు. మరోవైపు భారత్ చేపట్టిన సహాయక చర్యల వల్లే తమ దేశ పౌరులు భూకంపం ప్రాంతం నుంచి సురక్షితంగా బయట పడ్డారని ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నేతన్యహు చెప్పారు. ఇదంతా భారత ప్రధాని మోడీ ఘనతేనని ఆయన ప్రశంసించారు
Advertisement