త్వరలోనే యూరోప్ కు వెళ్లనున్న చెర్రీ

రామ్ చరణ్ తాజా సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. వాస్తవానికి నిన్ననే చెర్రీ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలుకావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు చెర్రీ సినిమాకు సంబంధించి నయా షెడ్యూల్ రిలీజ్ చేశారు. వచ్చేనెల రెండోవారం నుంచి రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ యూరోప్ లో ఉంటుంది. ఇప్పటివరకు తెలుగుతెరపై కనిపించని అద్భుతమైన లొకేషన్లను వెదికే పనిలో యూనిట్ […]

Advertisement
Update:2015-04-29 11:00 IST
రామ్ చరణ్ తాజా సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. వాస్తవానికి నిన్ననే చెర్రీ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలుకావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు చెర్రీ సినిమాకు సంబంధించి నయా షెడ్యూల్ రిలీజ్ చేశారు. వచ్చేనెల రెండోవారం నుంచి రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ యూరోప్ లో ఉంటుంది. ఇప్పటివరకు తెలుగుతెరపై కనిపించని అద్భుతమైన లొకేషన్లను వెదికే పనిలో యూనిట్ ఉంది. లొకేషన్లు ఫైనలైజ్ అయినవెంటనే రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి యూరోప్ వెళ్తాడు చరణ్. అక్కడే రెండు పాటల్ని షూట్ చేస్తారు. తాజా సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. మై నేమ్ ఈజ్ రాజు అనే పేరును పెట్టాలనుకుంటున్నారు. యూరోప్ షెడ్యూల్ నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్ లోనే చెర్రీ సినిమా షూటింగ్ మొత్తం ప్లాన్ చేశారు. ఏకథాటిగా షూటింగ్ కంప్లీట్ చేసి, దసరాకు సినిమాను సిద్ధం చేయాలని భావిస్తోంది మెగాకాంపౌండ్.
Tags:    
Advertisement

Similar News