మమతకే కోల్‌కతా పట్టం..
పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలు పాలక పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. కోల్‌కతా కార్పోరేషన్ కూడా మమత పార్టీకే దక్కింది. గతంలో జరిగిన ఎన్నికల కంటే కూడా ఈ సారి తృణమూల్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం 92 మున్సిపాలిటీలకు గాను 71 పాలక తృణమూల్ గెలుచుకుంది. మమత పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోయిన అధికారాన్ని సాధించుకోవాలని సీపీఎం ఉవ్విళ్ళూరుతోంది. ఇంతలో జరిగిన స్థానిక ఎన్నికలు […]
Advertisement
పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలు పాలక పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. కోల్‌కతా కార్పోరేషన్ కూడా మమత పార్టీకే దక్కింది. గతంలో జరిగిన ఎన్నికల కంటే కూడా ఈ సారి తృణమూల్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం 92 మున్సిపాలిటీలకు గాను 71 పాలక తృణమూల్ గెలుచుకుంది. మమత పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోయిన అధికారాన్ని సాధించుకోవాలని సీపీఎం ఉవ్విళ్ళూరుతోంది. ఇంతలో జరిగిన స్థానిక ఎన్నికలు సీపీఎం శ్రేణుల ఉత్సాహం మీద నీళ్ళు చల్లాయి. అటు బీజేపీ కూడా ఎంతో దూకుడు మీదున్నా కేంద్రంలో ఉన్న అధికారం వారికి ఉపయోగపడలేదు. మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నింటినీ దెబ్బతీసి స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఉత్సాహంతో ఉన్న మమతా బెనర్జీ..వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ముందుకు జరిపే అవకాశం ఉందంటూ బెంగాల్ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Advertisement