మాజీ మంత్రి భర్తపై కేసు
యూపీఏ హయాంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఉత్తరాంధ్రకు చెందిన కిల్లి కృపారాణి భర్తపై విశాఖపట్టణంలోని భీమిలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీల విషయంలో స్నేహితుడి భార్యనే చంపుతానని బెదిరించిన కృపారాణి భర్త డాక్టర్ కిల్లి రామ్మోహనరావును, ఆయన కార్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఒక స్థలం విషయంలో స్నేహితుడైన మరో డాక్టర్ నుంచి రామ్మోహనరావుకు 3 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఆ డబ్బు అడిగేందుకు స్నేహితుడి ఇంటికి […]
Advertisement
యూపీఏ హయాంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఉత్తరాంధ్రకు చెందిన కిల్లి కృపారాణి భర్తపై విశాఖపట్టణంలోని భీమిలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీల విషయంలో స్నేహితుడి భార్యనే చంపుతానని బెదిరించిన కృపారాణి భర్త డాక్టర్ కిల్లి రామ్మోహనరావును, ఆయన కార్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఒక స్థలం విషయంలో స్నేహితుడైన మరో డాక్టర్ నుంచి రామ్మోహనరావుకు 3 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఆ డబ్బు అడిగేందుకు స్నేహితుడి ఇంటికి వెళ్ళిన రామ్మోహనరావు..అతను లేకపోవడంతో స్నేహితుడి భార్యపై దౌర్జన్యానికి పాల్బడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను ఎవరిపైనా దౌర్జన్యం చేయలేదని కేవలం డబ్బు అడగడానికే వెళ్ళానని రామ్మోహనరావు చెబుతున్నారు.
Advertisement