గ్రీన్‌ టీతో ఎన్నో ఉపయోగాలు

మారిన జీవనప్రమాణాలు, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలకు ఔషధాలు అవసరమవుతాయి. కానీ కొన్ని సమస్యలను మనం ఇంట్లో లభించే పదార్ధాలతోనే పరిష్కరించుకోవచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకునే గ్రీన్ టీతో ఎన్నో సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి.   – మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారంతా గ్రీన్ టీని తీసుకోవలసిందే.  – రెండు యాపిల్స్, ఐదు రకాల కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రెండు కప్పుల గ్రీన్ టీలో లభిస్తాయని పరిశోధనలలో తేలింది. […]

;

Advertisement
Update:2015-04-28 02:41 IST
గ్రీన్‌ టీతో ఎన్నో ఉపయోగాలు
  • whatsapp icon
మారిన జీవనప్రమాణాలు, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలకు ఔషధాలు అవసరమవుతాయి. కానీ కొన్ని సమస్యలను మనం ఇంట్లో లభించే పదార్ధాలతోనే పరిష్కరించుకోవచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకునే గ్రీన్ టీతో ఎన్నో సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి.
– మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలనుకునేవారంతా గ్రీన్ టీని తీసుకోవలసిందే.
– రెండు యాపిల్స్, ఐదు రకాల కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రెండు కప్పుల గ్రీన్ టీలో లభిస్తాయని పరిశోధనలలో తేలింది.
– ప్రతిరోజూ కనీసం రెండు, మూడు సార్లు గ్రీన్‌టీ తాగితేనే ఆరోగ్యంతో పాటు అందం కూడా ఇనుమడిస్తుంది.
– జీర్ణ ప్రక్రియ వేగవంతమై ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
– గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది.బ్లడ్ సుగర్ స్థాయి తగ్గుతుంది.
– గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ రాకుండా కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
– ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. వెంట్రుకలు ఊడడమూ తగ్గుతుంది.
– రోజుల తరబడి గంటల కొద్దీ వ్యాయామం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల కూడా పొందవచ్చు.
– గ్రీన్ టీలో లభించే థినైన్ అనే కాంపొనెంట్ మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
– క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి గ్రీన్ టీలో ఉంది.
– రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే స్త్రీలు రోజుకు నాలుగు నుంచి ఐదు కప్పుల గ్రీన్ టీ తాగడం మంచిదని పరిశోధనలలో తేలింది.
– మూడు నుంచి ఆరు కప్పుల గ్రీన్ టీని ప్రతిరోజూ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 15 నుంచి 16శాతం వరకు తగ్గిపోతాయని పరిశోధకులంటున్నారు.
– ఫేషియల్ సమయంలో సాధారణ వేడినీటితో ముఖానికి ఆవిరి పడుతుంటారు. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్‌ను ఉపయోగించవచ్చు. మూడు నుంచి నాలుగు నిమిషాలసేపు ఆవిరి పట్టడం వల్ల ముఖ వర్ఛస్సు పెరుగుతుంది.
Tags:    
Advertisement

Similar News