మరో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
మరో బడా ఎర్ర చందనం స్మగ్లర్ పోలీసుల వలలో చిక్కాడు. వారం రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం తమిళనాడు సిటీ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ స్మగ్లర్ పేరు సోము రవి. ఇతనిపై 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి అనేకసార్లు పట్టుబడినట్టే అనిపించినా చివరి నిమషంలో తప్పించుపోయే సోము జాడ తెలుసుకుని పకడ్బందీగా పట్టుకున్నారు. ఇతనితో పాటు […]
Advertisement
మరో బడా ఎర్ర చందనం స్మగ్లర్ పోలీసుల వలలో చిక్కాడు. వారం రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం తమిళనాడు సిటీ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ స్మగ్లర్ పేరు సోము రవి. ఇతనిపై 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి అనేకసార్లు పట్టుబడినట్టే అనిపించినా చివరి నిమషంలో తప్పించుపోయే సోము జాడ తెలుసుకుని పకడ్బందీగా పట్టుకున్నారు. ఇతనితో పాటు ఉన్న మరో 11 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 28 ఎర్రచందనం దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
Advertisement