ఐఎస్ ఐఎస్ చీఫ్ బాగ్దాదీ హ‌తం..

ప్ర‌పంచ పోలీస్ అమెరికాను, దాని మిత్ర దేశాల‌ను వ‌ణికిస్తున్న ఐఎస్ ఐఎస్ చీఫ్ అబూబ‌క‌ర్ అల్ బాగ్దాదీ హ‌త‌మైన‌ట్లు ఇరాన్ రేడియో ప్ర‌కటించింది. మార్చి 18న అమెరికా ద‌ళాలు జ‌రిపిన బాంబింగ్ దాడిలో బాగ్దాదీ తీవ్రంగా గాయ‌ప‌డి త‌ర్వాత చ‌నిపోయిన‌ట్లు ఇరాన్ రేడియో తెలిపింది. ఉగ్ర‌వాద నాయ‌కుడు గాయ‌ప‌డిన‌ట్లు ధృవీక‌రించుకున్న అమెరికా ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు ఇంకా ధృవీక‌రించుకోలేక‌పోతోంది. ఎందుకంటే ఆల్‌ఖైదా చీఫ్ బిన్ లాడెన్ కంటే బాగ్దాదీ అత్యంత క్రూర‌మైన ఉగ్ర‌వాదిగా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌పంచాన్ని ఇస్లామిక్ […]

Advertisement
Update:2015-04-27 21:00 IST
ప్ర‌పంచ పోలీస్ అమెరికాను, దాని మిత్ర దేశాల‌ను వ‌ణికిస్తున్న ఐఎస్ ఐఎస్ చీఫ్ అబూబ‌క‌ర్ అల్ బాగ్దాదీ హ‌త‌మైన‌ట్లు ఇరాన్ రేడియో ప్ర‌కటించింది. మార్చి 18న అమెరికా ద‌ళాలు జ‌రిపిన బాంబింగ్ దాడిలో బాగ్దాదీ తీవ్రంగా గాయ‌ప‌డి త‌ర్వాత చ‌నిపోయిన‌ట్లు ఇరాన్ రేడియో తెలిపింది. ఉగ్ర‌వాద నాయ‌కుడు గాయ‌ప‌డిన‌ట్లు ధృవీక‌రించుకున్న అమెరికా ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు ఇంకా ధృవీక‌రించుకోలేక‌పోతోంది. ఎందుకంటే ఆల్‌ఖైదా చీఫ్ బిన్ లాడెన్ కంటే బాగ్దాదీ అత్యంత క్రూర‌మైన ఉగ్ర‌వాదిగా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌పంచాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చ‌డానికి హింస‌నే న‌మ్ముకుని ముందుగా అమెరికాను, దాని మిత్ర‌దేశాల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నాడు. ఇప్ప‌టికే ఎంద‌రినో ఐరోపా వాసుల్ని, త‌న సంఘాన్ని వ్య‌తిరేకించే వారిని దారుణంగా హ‌త‌మార్చి వీడియోలు ఇంట‌ర్నెట్‌లో ఉంచాడు. టెక్నాల‌జీ అందుబాటులోకి రావ‌డంతో దాని ద్వారానే ప్ర‌పంచ‌వ్యాప్తంగా యువ‌త‌ను ఉగ్ర‌వాద ఉచ్చులోకి లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే అమెరికా బాంబింగ్ జ‌రిపింది. బాగ్దాది త‌ల‌పై అమెరికా కోటి డాల‌ర్ల‌ను బ‌హుమ‌తిగా ప్ర‌క‌టించింది. ఉగ్ర‌వాది నిజంగా మ‌ర‌ణించి ఉంటే ఆ మొత్తం ఎవ‌రికి చెందుతుందో?
Tags:    
Advertisement

Similar News