ఇషా పౌండేషన్‌కు 20 ఎకరాల భూమి ?
హైదరాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇషా ఫౌండేషన్‌కు విజయవాడ సమీపంలో ఇరవై ఎకరాల భూమి కేటాయించే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. కొన్ని సంస్థల ఏర్పాటు కోసం తమ ఫౌండేషన్‌కు స్థలం కావాలని ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు జగ్గి వాసుదేవ్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. నూట ఏభై ఎకరాల్లో లీడర్‌షిప్ అకాడమీని, వంద ఎకరాల్లో అంతర్జాతీయ న్యాయ విద్యా కళాశాల ‘లా స్కూల్ ఫర్ కార్పొరేట్ లా’, ఏభై ఎకరాల్లో క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తానని […]
By - Pragnadhar ReddyUpdate:2015-04-27 21:20 IST
హైదరాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇషా ఫౌండేషన్‌కు విజయవాడ సమీపంలో ఇరవై ఎకరాల భూమి కేటాయించే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. కొన్ని సంస్థల ఏర్పాటు కోసం తమ ఫౌండేషన్‌కు స్థలం కావాలని ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు జగ్గి వాసుదేవ్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. నూట ఏభై ఎకరాల్లో లీడర్‌షిప్ అకాడమీని, వంద ఎకరాల్లో అంతర్జాతీయ న్యాయ విద్యా కళాశాల ‘లా స్కూల్ ఫర్ కార్పొరేట్ లా’, ఏభై ఎకరాల్లో క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తానని ఆయన ప్రతిపాదించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కొన్ని భూములను ఇటీవల ఆయన పరిశీలించారు. అంతర్జాతీయంగా విస్తృత సంబంధాలు ఉన్న ఆధ్యాత్మిక గురువు కావడంతో.. ఆయనతోపాటు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వెళ్ళారు. పలు రాష్ట్రాలు తమకు కావాల్సినంత భూమి ఇస్తామని… తమ వద్ద ఈ సంస్థలు పెట్టాలని కోరుతున్నాయని, కాని ఏపీ ప్రభుత్వంపై అభిమానంతో తాను ఇక్కడే పెట్టాలని అనుకుంటున్నానని జగ్గివాసుదేవ్ ఆ సందర్భంగా మంత్రితో చెప్పారు. అయితే.. ఆయన నెలకొల్పదల్చిన సంస్థలకు ఇరవై ఎకరాలు మాత్రం ఇవ్వడానికి.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇటీవల మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఇషా ఫౌండేషన్‌కు నాలుగు వందల ఎకరాల భూమి ఇస్తున్నామనడంలో నిజం లేదని సీఎం ఆ సందర్భంగా చెప్పారు. ‘రాజధానిలో అన్ని రకాల సంస్థలు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే దానికి పూర్తి స్వరూపం వస్తుంది. ఈ కోణంలోనే ఇషా ఫౌండేషన్ ఆసక్తిని పరిశీలిస్తున్నాం. కాని ఎంత భూమి అవసరమో చూసి అంతే ఇస్తాం తప్ప కోరినంత ఇవ్వలేం’ అని మంత్రి అన్నారు.