అవయవ దానంతో ఐదుగురికి పునర్జన్మ

విశాఖపట్నం: రోడ్డు ప్ర‌మాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ వ్య‌క్తి అవ‌య‌వాల్ని ఐదుగురికి అమ‌ర్చి కొత్త జీవితాల్ని ప్ర‌సాదించారు విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌లోని వైద్యులు. స‌త్య‌నారాయ‌ణ అనే వ్యక్తి అవయవాన్ని హైదరాబాద్‌కు తరలించి ఒక వృద్ధుడికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ (63) దీర్ఘకాలిక కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ఇక బతుకుపై ఆశలు సన్నగిల్లుతున్న ఆ వృద్ధుడికి సోమవారం రాత్రి విశాఖలో ఓ బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి కాలేయం సిద్ధంగా ఉందని స‌మాచారం ఇచ్చారు. ఈ అవ‌య‌వాన్ని […]

Advertisement
Update:2015-04-28 06:48 IST
విశాఖపట్నం: రోడ్డు ప్ర‌మాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ వ్య‌క్తి అవ‌య‌వాల్ని ఐదుగురికి అమ‌ర్చి కొత్త జీవితాల్ని ప్ర‌సాదించారు విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌లోని వైద్యులు. స‌త్య‌నారాయ‌ణ అనే వ్యక్తి అవయవాన్ని హైదరాబాద్‌కు తరలించి ఒక వృద్ధుడికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన రిటైర్డ్‌ ఇంజనీర్‌ (63) దీర్ఘకాలిక కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ఇక బతుకుపై ఆశలు సన్నగిల్లుతున్న ఆ వృద్ధుడికి సోమవారం రాత్రి విశాఖలో ఓ బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి కాలేయం సిద్ధంగా ఉందని స‌మాచారం ఇచ్చారు. ఈ అవ‌య‌వాన్ని తీసుకెళ్లమని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీవన్‌దాన్‌ నుంచి గ్లోబల్‌ ఆసుపత్రికి సమాచారం అందింది. దీంతో విశాఖ సెవెన్‌హిల్స్‌లో బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి కాలేయం సేకరించి మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు టాంచెరియన్‌, బల్‌బీర్‌సింగ్‌తో పాటు 15 మంది ఐదు గంటల పాటు వృద్ధుడికి ప్రత్యేక శస్త్ర చికిత్స చేసి కాలేయ మార్పిడిని నిర్వహించారు. విశాఖపట్నంకు చెందిన సత్యనారాయణ (53) నుంచి సేకరించిన అవయవాలతో మొత్తం ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సత్యనారాయణ బ్రెయిన్‌డెడ్‌గా సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. సత్యనారాయణ నుంచి సేకరించిన కాలేయాన్ని గ్లోబల్‌ ఆసుపత్రికి, ఒక కిడ్నీని సెవెన్‌హిల్స్‌కు,మరొక కిడ్నీ విశాఖపట్నం కేర్‌ ఆసుపత్రికి, రెండు కళ్లను మరో ఇద్దరికి అమర్చి అంద‌రికీ పున‌ర్జ‌న్మ‌ను ప్ర‌సాదించారు వైద్యులు.
Tags:    
Advertisement

Similar News