వచ్చే ఎన్నికల నాటికి విజయవాడ మెట్రో సిద్ధం..
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌లో ఒక కారిడార్‌ను సిద్ధం చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది. మెట్రో రైల్ ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ విజయవాడ మెట్రో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. 26 కిలోమీటర్ల పొడవుతో రెండు కారిడార్లలో నిర్మించే మెట్రోకు 6,823 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కి.మీ కు 209 కోట్లు ఖర్చవుతుందని ఇప్పటి అంచనా. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ప్రధాన కేంద్రంగా బందర్‌రోడ్డులో […]
Advertisement
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌లో ఒక కారిడార్‌ను సిద్ధం చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది. మెట్రో రైల్ ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ విజయవాడ మెట్రో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. 26 కిలోమీటర్ల పొడవుతో రెండు కారిడార్లలో నిర్మించే మెట్రోకు 6,823 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కి.మీ కు 209 కోట్లు ఖర్చవుతుందని ఇప్పటి అంచనా. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ప్రధాన కేంద్రంగా బందర్‌రోడ్డులో పెనమలూరు వరకు ఒక కారిడార్, బస్‌స్టేషన్ నుంచే రైల్వే స్టేషన్, ఏలూరు రోడ్ మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ వరకు ఒక కారిడార్‌ను నిర్మిస్తారు. బస్‌స్టేషన్ నుంచే రాజధాని నగరం అమరావతి వరకు కూడా తర్వాతి దశలో విస్తరిస్తారు. 2019 జనవరి ఒకటి నాటికి విజయవాడ మెట్రోలో తొలి కారిడార్‌ను పూర్తి చేసి ప్రజలకు ఏదో ఒక అభివృద్ధి చూపించాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. మెట్రో రిపోర్ట్ రావడంతో ఇక యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సంకల్పించారు. మెట్రో రైల్ రెండు కారిడార్లకు కలిపి 31 వేల హెక్టార్ల భూమి అవసరం పడుతుంది. ఇందులో మార్గాలు, రైల్వే స్టేషన్ల నిర్మాణాలు ఉంటాయి. మార్గం అయితే రోడ్లు ఉన్నాయి అవన్నీ ప్రభుత్వానికి చెందిన భూములే. ఇక స్టేషన్ల నిర్మాణాలకే ప్రయివేటు భూముల్ని భారీగా సేకరించాల్సి ఉంటుంది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముందో, వెనుకో మెట్రో రైల్‌కు కూడా శంకుస్థాపన జరుగుతుంది. విశాఖ మెట్రో రైల్ రిపోర్ట్ కూడా జూన్ 15లోగా రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది.
Advertisement